Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 58:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది? మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా? ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా? యెహోవాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనని మీరనుకుంటున్నారా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా? ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్రమేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కనబడాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మానివేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది? మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా? ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా? యెహోవాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనని మీరనుకుంటున్నారా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 58:5
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజు ఆ స్త్రీ చెప్పింది విన్నప్పుడు, తన బట్టలు చించుకున్నాడు. అతడు ప్రాకారం దగ్గర నడుస్తూ వెళ్తున్నప్పుడు, ప్రజలు అతనిపై వస్త్రం లోపల గోనెపట్ట ఉండడం చూశారు.


యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిశ్చయించుకున్నాడు, అంతేగాక యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు.


అప్పుడు ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి బయలుదేరి ఎల్యాషీబు కుమారుడైన యెహోహనాను గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు, ఎజ్రా అన్నపానాలు పుచ్చుకోలేదు ఎందుకంటే, చెరగొనిపోబడిన వారి నమ్మకద్రోహాన్ని బట్టి దుఃఖించాడు.


అప్పుడు అక్కడ అహవా కాలువ దగ్గర, మనమందరం ఉపవాసం ఉండి, మన దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుని మనకు మన పిల్లలకు మన ఆస్తి అంతటికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వమని వేడుకుందామని నేను ప్రకటించాను.


“వెళ్లండి, షూషనులో ఉన్న యూదులందరిని సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండమని చెప్పండి. మూడు రోజులపాటు ఏమీ తినవద్దు త్రాగవద్దు. నేను, నా సేవకులు కూడా మీరు చేసినట్లు ఉపవాసం పాటిస్తాము. ఇలా చేసిన తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తాను అది చట్టానికి విరుద్ధమైనా ఫర్వాలేదు. నేను చస్తే చస్తాను.”


రాజు శాసనం, ఆదేశం వెళ్లిన ప్రతి సంస్థానంలో ఉన్న యూదులంతా ఉపవాసం ఉండి ఏడుస్తూ వేదనతో తీవ్రమైన దుఃఖంతో ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఉన్నారు.


అప్పుడు అతడు ఒళ్ళంతా చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు.


అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప ప్రేమతో, మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి.


యెహోవా చెప్పే మాట ఇదే: “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను, రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను; దేశాన్ని పునరుద్ధరించి పాడైన స్వాస్థ్యాలను పంచడానికి బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని, చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి,


వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా మీరెందుకు చూడరు? మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరెందుకు గమనించరు?’ “అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు మీ పనివారినందరిని దోచుకున్నారు.


యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,


“నెల పదవ రోజున మీరంతా ఉపవాసముండాలి. స్వదేశీయులు గాని, మీ ఇంట్లో ఉన్నా విదేశీయులు గాని ఎవరైనా సరే ఈ నియమం అందరికి వర్తిస్తుంది. ఆ రోజున ఎవరూ ఏ పని చేయకూడదు.


ఆ రోజు మీకు సబ్బాతు విశ్రాంతి దినము. అప్పుడు మీరు ఉపవాసముండాలి; ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.


“దేశ ప్రజలందరినీ, యాజకులను ఇలా అడుగు, ‘మీరు గత డెబ్బై సంవత్సరాలుగా అయిదవ నెలలో, ఏడవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించినప్పుడు, మీరు నిజంగా నా కోసం ఉపవాసం ఉన్నారా?


“మీరు ఉపవాసం ఉన్నప్పుడు, తాము ఉపవాసం ఉంటున్నామని ఇతరులకు తెలియాలని తమ ముఖాలను నీరసంగా పెట్టుకొనే వేషధారుల్లా నీరసంగా ఉండవద్దు. అలా చేసినవారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు.”


ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.


మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ