Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 58:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో, ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది. మీ స్వరం పరలోకంలో వినపడాలని మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు. మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 మీరు ఆకలిగా ఉన్నారు కాని అన్నంకోసర కాదు. ఆహారంకోసం గాక వాదనకోసం, పోరాటం కొసం మీరు ఆకలిగా ఉన్నారు. మీ చెడ్డ చేతులతో ప్రజలను కొట్టాలని మీరు ఆకలిగా ఉన్నారు. మీరు భోజనం మానివేయటం నాకోసం కాదు. నన్ను స్తుతించుటకు మీరు మీ స్వరం వినియోగించటం మీకు ఇష్టం లేదు. నేను కోరేది అంతా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో, ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది. మీ స్వరం పరలోకంలో వినపడాలని మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 58:4
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!


ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; మీరు చాలా ప్రార్థనలు చేసినా నేను వినను. “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి!


యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు: “మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు; పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది.


మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు? పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?” అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు.


కాని మీ పాపాలు మిమ్మల్ని మీ దేవుని నుండి వేరు చేశాయి; మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు కనబడకుండా చేశాయి, కాబట్టి ఆయన వినడం లేదు.


వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు. వారి పనులు చెడుపనులు. వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి.


యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.”


అతడు నీనెవెలో ఈ ప్రకటన చేశాడు: “రాజు, అతని ఘనుల శాసనం ప్రకారం: “మనుష్యులు గాని జంతువులు పశువులు గొర్రెల మందలు గాని దేన్ని రుచి చూడకూడదు తినకూడదు త్రాగకూడదు.


“వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! కాబట్టి మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు.


వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.


అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గర నుండి రోమా అధిపతి భవనానికి తీసుకెళ్లారు. అప్పటికి తెల్లవారింది కాబట్టి అపవిత్రపడకుండ పస్కాను తినాలని వారు భవనం లోనికి వెళ్లలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ