Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 54:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కనిపించకుండా పోవచ్చు, కొండలు ధూళి కావచ్చును. కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడువదు. నేను నీతో సమాధానపడతాను, అది ఎన్నటికీ అంతం కాదు.” యెహోవా నీ యెడల కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు చెప్పిన వాడు ఆయనే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 54:10
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఒకవేళ నా కుటుంబం దేవునితో సరిగా లేకపోయినా, నిజంగా ఆయన నాతో శాశ్వతమైన నిబంధన చేసి ఉండరు కదా, ఆ నిబంధన అన్నివిధాల పరిపూర్ణమైనది స్థిరమైనది; నిజంగా ఆయన నా రక్షణను ఫలవంతం చేసి ఉండరు, నా ప్రతి కోరికను ఇచ్చి ఉండరు.


అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు అవి అంతరిస్తాయి.


కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.


జలాలు గర్జించినా నురుగు కట్టినా పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా


వారికి ఆకలి గాని దాహం గాని వేయదు. ఎడారి వేడిగాలి గాని, ఎండ గాని వారికి తగలదు. వారిపట్ల దయగలవాడు వారిని తీసుకెళ్లి నీటి ఊటల ప్రక్క వారిని నడిపిస్తాడు.


“తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? తల్లియైన మరచిపోవచ్చు కాని నేను నిన్ను మరవను!


తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.


మీరు సంతోషంగా బయటకు వెళ్తారు, మీరు సమాధానంగా తీసుకెళ్తారు. మీ ఎదుట పర్వతాలు కొండలు పాటలు పాడడం ప్రారంభిస్తాయి, పొలం లోని చెట్లన్నీ తమ చేతులతో చప్పట్లు కొడతాయి.


శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.


దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.


“నేను వారితో చేసే నా నిబంధన ఇదే” అని యెహోవా చెప్తున్నారు. “మీమీద ఉన్న నా ఆత్మ మీ నుండి తొలిగిపోదు, నేను మీ నోటిలో ఉంచిన నా మాటలు, మీ పెదవుల నుండి, మీ పిల్లల పెదవుల నుండి, వారి వారసుల పెదవుల నుండి, ఇప్పటినుండి ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా తెలియజేస్తున్నారు.


“ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.


యెహోవా మనకు చేసినదంతటిని బట్టి, యెహోవా కృపలను, యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను. అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి ఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించి నేను చెప్తాను.


ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.


“ఈ శాసనాలు నా దృష్టి నుండి మాయమైతేనే,” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇశ్రాయేలు ఇక ఎన్నటికీ నా ఎదుట ఒక జనంగా ఉండదు.”


“యెహోవా ఇలా అంటున్నారు: ‘పగలు రాత్రులు వాటి నిర్ణీత సమయంలో రాకుండా నేను పగటికి, రాత్రికి చేసిన నా ఒడంబడికను మీరు భంగం చేస్తే,


అప్పుడు నీ మీద నా ఉగ్రత తగ్గిపోతుంది, రోషంతో కూడిన నా కోపం నీ మీద నుండి తొలగిపోతుంది; నేను ప్రశాంతంగా ఉంటాను, ఇకపై కోపంగా ఉండను.


“ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను.


నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు.


కాబట్టి నేను అతనితో సమాధాన ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పు.


నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.


ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు.


ఆకాశం భూమి గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి.


ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు.


“ఇంకొకసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండేలా కదిలింపబడేవి అంటే సృష్టింపబడినవి తీసివేయబడతాయి అని అర్థాన్నిస్తుంది.


ఆకాశం ఒక గ్రంథపుచుట్టలా చుట్టుకుపోయింది, ప్రతి పర్వతం ప్రతి ద్వీపం వాటి వాటి స్థలాల నుండి తొలగిపోయాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ