Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 49:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు లందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె దను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 నిన్ను బాధించేవారు తమ సొంత మాంసం తినేలా చేస్తాను. మద్యంతో మత్తుగా ఉన్నట్టు తమ సొంత రక్తంతో వాళ్ళు మత్తులవుతారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడిననీ నీ విమోచకుడిననీ మనుషులంతా తెలుసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 స్వంత శరీరాన్ని తినేట్టుగా, మిమ్నల్ని కష్టపెట్టే వారిని నేను బలవంతం చేస్తాను. వారి రక్తమే వారిని మత్తెక్కించే ద్రాక్షరసం అవుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని రక్షించే యెహోవానని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యాకోబు యొక్క మహా శక్తిమంతుడే మిమ్మల్ని రక్షించే వాడు అని మనుష్యులందరూ తెలుసుకొంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 49:26
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,


యెహోవా అనే నామం గల మీరు భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి.


తన న్యాయమైన క్రియల ద్వార యెహోవా బయలుపరచబడతారు; దుష్టులు తాము చేసిన దానిలోనే చిక్కుకుంటారు. సెలా


నేను మిమ్మల్ని నా సొంత ప్రజలుగా చేసుకుని, మీకు దేవుడనై ఉంటాను. అప్పుడు ఈజిప్టువారి కాడి క్రిందనుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.


కాబట్టి ప్రభువైన, సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు బలవంతుడు ఇలా చెప్తున్నారు: ఆహా! నా శత్రువులపై నా ఉగ్రతను బయటపెట్టి, నా విరోధుల మీద పగ తీర్చుకుంటాను.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది!


పారిపోయిన మోయాబీయులను నీతో ఉండనివ్వు; నాశనం చేసేవాని నుండి కాపాడే ఆశ్రయంగా ఉండు.” హాని చేసేవారు అంతం అవుతారు, విధ్వంసం ఆగిపోతుంది; అణచివేసేవారు భూమి మీద లేకుండా మాయమవుతారు.


అది ఈజిప్టు దేశంలో సైన్యాల యెహోవాకు సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవారిని గురించి వారు దేవునికి మొరపెట్టగా, ఆయన వారిని కాపాడడానికి రక్షకుడిని విమోచకుడిని పంపుతారు, అతడు వారిని రక్షిస్తాడు.


ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”


యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.


అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.


యెహోవానైన నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.


అప్పుడు సూర్యోదయ దిక్కునుండి సూర్యాస్తమయ స్థలం వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని ప్రజలు తెలుసుకుంటారు. యెహోవాను నేనే; నేను తప్ప వేరే ఎవరూ లేడు.


నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నీ దేవుడనైన యెహోవాను నేనే, నీకు ఏది మంచిదో అది నీకు బోధిస్తాను నీవు వెళ్లవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను.


రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన పాలకుల సేవకునితో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవా నమ్మకమైనవాడు కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు, యువరాజులు చూసి నమస్కారం చేస్తారు.”


ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది?


‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”


నీవు నీతిలో స్థాపించబడతావు: బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీవు దేనికి భయపడే అవసరం లేదు. భయం నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు.


నీవు దేశాల పాలు త్రాగుతావు రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.


కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు కాని ఇంకా ఆకలితోనే ఉంటారు. ఎడమ ప్రక్కన దానిని తింటారు కాని తృప్తి పొందరు. వారిలో ప్రతిఒక్కరు తన సంతానం యొక్క మాంసాన్ని తింటారు.


మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు, వారికి భారం కలిగించే కాడిని వారి భుజాలమీద ఉన్న కర్రను, వారిని హింసించేవాని కర్రను మీరు విరిచివేశారు.


నేను తప్పిపోయిన వాటిని వెదికి, తోలివేసిన వాటిని తిరిగి తోలుకు వస్తాను. నేను గాయపడిన వాటికి కట్టుకడతాను. బలహీనమైన వాటిని బలపరుస్తాను. క్రొవ్విన వాటిని బలిసిన వాటిని నాశనం చేస్తాను. మందను న్యాయంగా మేపుతాను.


“ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.


ఆ ద్రాక్ష గానుగ పట్టణానికి బయట ఉంది. అక్కడ ద్రాక్షపండ్లను త్రొక్కడంతో ఆ ద్రాక్ష గానుగ నుండి 1,600 స్టాడియా దూరం వరకు గుర్రాల కళ్లెమంత ఎత్తులో ఆ రక్తం నదిలా ప్రవహించింది.


వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.”


ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను. నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను.


మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ