Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 49:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను, జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను; వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను జనములతట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నానువారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను రాజ్యాల వైపు నా చెయ్యి ఎత్తుతాను. ప్రజలకు నా జెండాను సంకేతంగా ఎత్తుతాను. వాళ్ళు నీ కొడుకులను తమ చేతుల్లో తీసుకు వస్తారు. నీ కూతుళ్ళను తమ భుజాలమీద మోసుకువస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు, “చూడు, రాజ్యాలకు నేను నా చేయి ఊపుతాను. ప్రజలందరూ చూడగలిగేట్టు నేను నా పతాకాన్ని ఎగురవేస్తాను. అప్పుడు ఆ ప్రజలు నీ పిల్లలను నీ దగ్గరకు తీసుకొని వస్తారు. ఆ ప్రజలు నీ పిల్లలను వారి భుజాలమీద ఎత్తుకొంటారు, మరియు వారు తమ చేతుల్లో వారిని పట్టు కొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను, జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను; వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 49:22
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి.


ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక. అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి, వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు.


సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నుండి భూమ్యంతాల వరకు ఆయన పరిపాలిస్తారు.


ప్రభువా, మీరు సృజించిన దేశాలన్నీ వచ్చి మీ ముందు ఆరాధిస్తారు; వారు మీ నామానికి కీర్తి తెస్తారు.


ప్రజలు వారిని తీసుకువచ్చి వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు. ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు. వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని తమను బాధించిన వారిని పాలిస్తారు.


సమస్త లోకవాసులారా, భూలోక నివాసులారా, పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు మీరు చూస్తారు, బూర ఊదినప్పుడు మీరు వింటారు.


‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.


చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.”


రండి, గుమ్మాల ద్వారా రండి! ప్రజలకు మార్గం సిద్ధపరచండి. నిర్మించండి, రహదారిని నిర్మించండి! రాళ్లను తొలగించండి. దేశాలు చూసేలా జెండాను ఎత్తండి.


“నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు.


ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు.


అన్నిటిని పరిపాలించే సైన్యాల యెహోవాను వెదకడానికి, ఆయన దయను కోరడానికి అనేకమంది ప్రజలు, శక్తివంతమైన దేశాలు యెరూషలేముకు వస్తారు.”


తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


ప్రజలు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి, దేవుని రాజ్యంలో జరిగే విందులో తమ తమ స్థానాల్లో కూర్చుంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ