Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 48:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను. నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను; తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ వించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఈ విషయాలు ఇలా జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. అవి నా నోట్లో నుండే వచ్చాయి. నేనే వాటిని తెలియచేశాను. అకస్మాత్తుగా జరిగేలా వాటిని చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 “జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం క్రిందట నేను మీకు చెప్పాను. వాటిని గూర్చి నేను మీకు చెప్పాను. అకస్మాత్తుగా ఆ సంగతులు సంభవించేట్టు నేను చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను. నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను; తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 48:3
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు; క్రూరుల గుంపు ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది. హఠాత్తుగా ఒక క్షణంలోనే ఇది జరుగుతుంది.


ఈ పాపం మీకు బీటలు తీసి ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.


నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.


వినండి! అతడు ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, అక్కడ అతడు ఖడ్గం చేత చనిపోయేలా చేస్తాను.’ ”


“విగ్రహాల్లారా, ఏమి జరుగబోతుందో మాకు చెప్పండి. గతంలో జరిగిన వాటి గురించి చెప్పండి, తద్వారా మేము వాటిని పరిశీలించి అవి ఎలా నెరవేరాయో తెలుసుకుంటాము. జరుగబోయే సంగతులను మాకు తెలియజేయండి,


‘చూడండి, వారిక్కడ ఉన్నారు!’ అని మొదట సీయోనుతో చెప్పింది నేనే. యెరూషలేముకు శుభవార్త చెప్పడానికి నేను ఒక దూతను పంపాను.


చూడండి, గతంలో చెప్పిన సంగతులు జరిగాయి. క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను. అవి జరగకముందే వాటిని మీకు తెలియజేస్తాను.”


సర్వ దేశాలు గుమికూడాలి జనములు సమావేశమవ్వాలి. వారిలో ఎవరి దేవుళ్ళు ఇలాంటి సంగతులు మాకు తెలియజేశారు? గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు చెప్పారు? తాము నిర్దోషులని నిరూపించడానికి తమ సాక్షులను తీసుకురావాలి, అప్పుడు ఇతరులు విని, “ఇది నిజమే” అని చెప్తారు.


నా సన్నిధిలోకి వచ్చి సంగతులు తెలియజేయండి, వారు కలిసి ఆలోచన చేయాలి. పూర్వకాలం నుండి దీనిని తెలియజేసింది ఎవరు? చాలా కాలం క్రితం దానిని ప్రకటించింది ఎవరు? యెహోవానైన నేను కాదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిగల దేవుడను, రక్షకుడను; నేను తప్ప వేరే ఎవరూ లేరు.


ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో నెరవేరకుండా ఒక్కటి కూడా లేదు; ప్రతి ఒక్కటి నెరవేరింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ