Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 48:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 నీ వారసులు ఇసుకలా, నీ పిల్లలు లెక్కించలేని రేణువుల్లా ఉండేవారు. వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు ఎప్పుడూ నా ఎదుట నుండి నిర్మూలం కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు మరువబడదు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు. వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 మీరు నాకు విధేయులై ఉంటే, అప్పుడు మీకు ఎంతోమంది పిల్లలు పుట్టి ఉండేవారు. వాళ్లు ఇసుక రేణువులంత మంది ఉండేవాళ్లు. మీరు నాకు విధేయులై ఉంటే, అప్పుడు మీరు నాశనం చేయబడి ఉండేవాళ్లు కాదు. మీరు నాతోనే కొనసాగి ఉండేవాళ్లు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 నీ వారసులు ఇసుకలా, నీ పిల్లలు లెక్కించలేని రేణువుల్లా ఉండేవారు. వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు ఎప్పుడూ నా ఎదుట నుండి నిర్మూలం కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 48:19
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లా అంటే ఒకవేళ ఎవరైనా లెక్కించాలనుకున్నా లెక్కించలేనంత విస్తారంగా చేస్తాను.


నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు,


అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశంలో వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు సర్వజనాంగాల మధ్య ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.


నీకు చాలామంది పిల్లలు ఉంటారని, నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు.


అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.


మీరు దేశాలను మందలించి దుష్టులను నిర్మూలం చేశారు; మీరు వారి పేరును ఎప్పటికీ లేకుండ తుడిచివేశారు.


నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలినవారే తిరుగుతారు. నాశనం శాసించబడింది నీతియుక్తమైన శిక్ష ఉప్పొంగి ప్రవహిస్తుంది.


“నేను వారి మీదికి లేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు, “బబులోను పేరును దానిలో మిగిలినవారిని, సంతానాన్ని, వారసులను కొట్టివేస్తాను” అని యెహోవా తెలియజేస్తున్నారు.


నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.


వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు, నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.


నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను; నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను.


నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు; నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు.


నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.


“నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.


కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికొమ్మను, జమ్ము రెల్లును ఒకేరోజున తొలగిస్తారు.


నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ”


“అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.


“యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను.


ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు.


నన్ను విడిచిపెట్టు, నేను వారిని నాశనం చేసి, ఆకాశం క్రింద వారి పేరు ఉండకుండా తుడిచివేస్తాను. నిన్ను వారికంటే బలమైన దేశంగా, సంఖ్యలో వారికంటే ఎక్కువ ఉండేలా చేస్తాను” అని అన్నారు.


కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.


అంతేకాక, చనిపోయిన మహ్లోను యొక్క విధవరాలు, మోయాబీయురాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ విధంగా చనిపోయినవాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది, అతని కుటుంబం నుండి, అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు. ఈ రోజు మీరు సాక్షులు!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ