Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 47:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన పేరు సైన్యాల యెహోవా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 మా విమోచకునికి సేనల అధిపతి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా అని పేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 “‘దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు’” అని నా ప్రజలు అంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన పేరు సైన్యాల యెహోవా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 47:4
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా, నా కొండ, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.


భయపడకు, పురుగులాంటి యాకోబూ! కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.


ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను.


యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలును సృజించిన నేనే మీకు రాజును.”


యెహోవానైన నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.


“ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు, సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: నేను మొదటివాడను చివరివాడను; నేను తప్ప ఏ దేవుడు లేడు.


నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”


నేను మీ దేవుడనైన యెహోవాను, సముద్రపు అలలు ఘోషించేలా నేను దానిని రేపుతాను. సైన్యాల యెహోవా అని ఆయనకు పేరు.


నిన్ను సృష్టించినవాడే నీ భర్త ఆయన పేరు సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; ఆయన భూమి అంతటికి దేవుడు.


ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు.


పర్వతాలను ఏర్పరచింది గాలిని సృష్టించింది ఆయనే, తన ఆలోచనలను మనుష్యులకు వెల్లడి చేసేది, ఉదయాన్ని చీకటిగా మార్చేది ఆయనే, భూమి ఎత్తైన స్థలాల్లో ఆయన నడుస్తారు ఆయన పేరు దేవుడైన సైన్యాల యెహోవా.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ