Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 45:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 యెహోవా చెప్పే మాట ఇదే: ఆకాశాలను సృష్టించిన యెహోవాయే దేవుడు. ఆయన భూమికి ఆకారమిచ్చి దానిని స్థిరపరిచారు: దానిని శూన్యంగా సృష్టించలేదు కాని, నివాస స్థలంగా దానిని చేశారు. ఆయన అంటున్నారు: “యెహోవాను నేనే మరి వేరే ఎవరూ లేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా– యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు. నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు. ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. “యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 యెహోవాయే దేవుడు. ఆయనే భూమిని, ఆకాశాలను సృజించాడు. భూమిని యెహోవా దాని స్థానంలో ఉంచాడు. యెహోవా భూమిని చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన కోరలేదు. భూమి మీద జీవం ఉండాలని యెహోవా కోరాడు. యెహోవా చెబుతున్నాడు: “నేనే యెహోవాను. నేను తప్ప ఇంకో దేవుడు లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 యెహోవా చెప్పే మాట ఇదే: ఆకాశాలను సృష్టించిన యెహోవాయే దేవుడు. ఆయన భూమికి ఆకారమిచ్చి దానిని స్థిరపరిచారు: దానిని శూన్యంగా సృష్టించలేదు కాని, నివాస స్థలంగా దానిని చేశారు. ఆయన అంటున్నారు: “యెహోవాను నేనే మరి వేరే ఎవరూ లేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 45:18
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు.


భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు.


అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు.


దేవుడు వారితో, “మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి” అని చెప్పి ఆశీర్వదించారు.


అప్పుడు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదిస్తూ, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నింపండి.


ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.


ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!


ఆకాశాలను సృష్టించి వాటిని విశాలపరచి, భూమిని దానిలో పుట్టిన సమస్తాన్ని విస్తరింపజేసి, దానిపై ఉన్న ప్రజలకు ఊపిరిని, దానిపై నడిచే వారికి జీవాన్ని ఇస్తున్న దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:


“నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవాను నేనే అన్నిటిని సృష్టించాను, నేనే ఆకాశాలను విశాలపరిచాను నేను నేనే భూమికి ఆకారమిచ్చాను.


భూమిని కలుగచేసింది దాని మీద ఉన్న నరులను సృష్టించింది నేనే. నా సొంత చేతులు ఆకాశాలను విశాలపరిచాయి; నేను వాటి నక్షత్ర సమూహాలను నడిపిస్తాను.


నా సొంత చేయి భూమికి పునాదులను వేసింది, నా కుడిచేయి ఆకాశాలను విశాలపరిచింది; నేను వాటిని పిలిచినప్పుడు అవన్నీ కలసి నిలబడతాయి.


ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది?


అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.


“ఆయన తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ