యెషయా 44:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నాలా ఎవరు ఉన్నారు? అతడు ప్రకటించాలి. నేను నా మొదటి ప్రజలను నియమించినప్పటి నుండి ఏమి జరిగిందో, ఇంకా ఏమి జరగబోతుందో అతడు తెలియజేయాలి, నా ముందు ఉంచాలి. అవును ఏమి జరగబోతుందో వారు తెలియజేయాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు? అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 నావంటి దేవుడు ఇంకొకడు లేడు. అలా ఉంటే, ఆ దేవుడు ఇప్పుడు మాట్లాడాలి. ఆ దేవుడు వచ్చి, తాను నావలె ఉన్నట్టు రుజువు చూపించాలి. శాశ్వతంగా ఉండే ఈ ప్రజలను నేను సృజించినప్పుడు ఏమి జరిగిందో ఆ దేవుడు నాతో చెప్పాలి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అది అతనికి తెలిసినట్టు చూపించుటకు ఆ దేవుడు సూచనలు ఇవ్వాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నాలా ఎవరు ఉన్నారు? అతడు ప్రకటించాలి. నేను నా మొదటి ప్రజలను నియమించినప్పటి నుండి ఏమి జరిగిందో, ఇంకా ఏమి జరగబోతుందో అతడు తెలియజేయాలి, నా ముందు ఉంచాలి. అవును ఏమి జరగబోతుందో వారు తెలియజేయాలి. အခန်းကိုကြည့်ပါ။ |