Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 44:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. పర్వతాల్లారా, అరణ్యమా, నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. యెహోవా యాకోబును విడిపించారు ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్న తునిగా కనుపరచుకొనును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి. భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది. పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి. అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక. ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. పర్వతాల్లారా, అరణ్యమా, నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. యెహోవా యాకోబును విడిపించారు ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 44:23
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; “యెహోవా పరిపాలిస్తున్నారు!” అని దేశాల్లో ప్రకటించబడాలి.


సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి; పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి!


అడవి చెట్లు పాటలు పాడాలి, అవి యెహోవా ఎదుట ఆనందంతో పాటలు పాడాలి, యెహోవా భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నారు.


భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి, సమస్త సముద్రపు అగాధాల్లారా,


పర్వతాల్లారా, సమస్తమైన కొండలారా, ఫలమిచ్చే చెట్లు, సమస్త దేవదారు వృక్షాల్లారా,


పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి; వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు.


ఆకాశం భూమి ఆయనను స్తుతించును గాక, సముద్రాలు వాటిలో ఉండే జలచరాలన్నీ ఆయనను స్తుతించును గాక.


ఎందుకంటే దేవుడు సీయోనును రక్షిస్తారు, యూదా పట్టణాలను తిరిగి కడతారు. అప్పుడు ప్రజలు అక్కడ నివసించి దానిని స్వాధీనం చేసుకుంటారు.


మీ బాహువు శక్తి కలది; మీ చేయి బలమైనది, మీ కుడిచేయి ఘనమైనది.


ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యెహోవా చేసిన మేలులన్నిటిని విని యెత్రో ఎంతో సంతోషించాడు.


యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు; లోకమంతటికి ఇది తెలియాలి.


యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు; మీరు దేశాన్ని వృద్ధిచేశారు. మీరు మీకే మహిమ సంపాదించుకున్నారు; మీరు దేశపు సరిహద్దులన్నిటిని విస్తరింపజేశారు.


అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.


నా పేరుపెట్టబడిన వారందరిని, నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని, నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి.”


నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.


ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు.


“ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు. నీ ద్వారా నా మహిమను కనుపరుస్తాను” అని ఆయన నాతో చెప్పారు.


యెహోవా తన ప్రజలను ఆదరించారు, ఆయన యెరూషలేమును విడిపించారు. కాబట్టి యెరూషలేము శిథిలాల్లారా, కలిసి సంతోషంతో పాటలు పాడండి.


అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.


సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.


ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు.


అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, ఎందుకంటే ఉత్తర దిక్కునుండి నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఒకవైపు లోకమంతా సంతోషిస్తూ ఉంటే, నేను నిన్ను నాశనం చేస్తాను.


“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచించి ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.


“ ‘కాని ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ ఇంటికి తిరిగి వస్తారు, కాబట్టి మీరు కొమ్మలుగా ఎదిగి వారి కోసం పండ్లు ఇవ్వాలి.


దేశంలోని ప్రజలందరూ వారిని పాతిపెడతారు, నేను ఘనత పొందిన ఆ రోజు వారికి ఘనత కలుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.


సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.


ఆయన ఆరోహణం అయ్యారంటే ఆయన క్రిందకు, భూమి మీదకు దిగివచ్చారని దాని అర్థం కాదా?


ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.


కాబట్టి ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా ఆనందించండి! అయితే భూమికి సముద్రానికి శ్రమ! ఎందుకంటే, అపవాది మీ దగ్గరకు దిగివచ్చాడు! తనకు కొద్ది కాలమే మిగిలి ఉందని అతనికి తెలుసు కాబట్టి అతడు తీవ్రమైన కోపంతో ఉన్నాడు” అని ప్రకటించడం నేను విన్నాను.


“పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ