యెషయా 44:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఎవరూ ఆలోచించడం లేదు, “దీనిలో సగం ఇంధనంగా వాడాను; దాని నిప్పుల మీద రొట్టె కూడా కాల్చాను, నేను మాంసం వండుకుని తిన్నాను. నేను మిగిలిన దానితో అసహ్యమైన దానిని చేయాలా? నేను చెట్టు మొద్దుకు నమస్కారం చేయాలా?” అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి గాని వివేచన గాని లేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనముచేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఎవరూ ఆలోచించడం లేదు. ‘నేను సగం చెక్కను అగ్నిలో కాల్చాను, ఆ నిప్పుల మీద రొట్టె కాల్చుకుని, మాంసం వండుకుని భోజనం చేశాను. మిగిలిన చెక్కను తీసుకుని దానితో అసహ్యమైన దాన్ని చేయాలా? ఒక చెట్టు మొద్దుకు సాగిలపడి నమస్కరించాలా?’ అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి, వివేచన లేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 ఆ మనుష్యులు ఈ విషయాలను గూర్చి ఆలోచించలేదు. ఆ మనుష్యులు గ్రహించరు గనుక, “సగం కట్టెలు నేనే కాల్చేశాను, నా రొట్టె కాల్చుకొనేందుకు, నా మాంసం వండుకొనేందుకు ఆ నిప్పులు నేను వాడుకొన్నాను. ఆ మాంసం నేను తిన్నాను. మరి మిగిలిన కట్టెను ఉపయోగించి ఈ భయంకరమైన పని చేశాను. నేను ఒక చెక్క ముక్కనే పూజిస్తున్నాను” అని వారి మట్టుకు వారు ఎన్నడూ తలంచలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఎవరూ ఆలోచించడం లేదు, “దీనిలో సగం ఇంధనంగా వాడాను; దాని నిప్పుల మీద రొట్టె కూడా కాల్చాను, నేను మాంసం వండుకుని తిన్నాను. నేను మిగిలిన దానితో అసహ్యమైన దానిని చేయాలా? నేను చెట్టు మొద్దుకు నమస్కారం చేయాలా?” అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి గాని వివేచన గాని లేదు. အခန်းကိုကြည့်ပါ။ |
అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;