Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 44:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 కమ్మరి తన పనిముట్టు తీసుకుని దానితో నిప్పుల మీద పని చేస్తాడు; సుత్తితో విగ్రహానికి రూపిస్తాడు తన చేతి బలంతో దానిని తయారుచేస్తాడు. అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. అతడు నీళ్లు త్రాగడు, సొమ్మసిల్లిపోతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 కమ్మరి ఇనుప గొడ్డలిని పదును చేస్తూ నిప్పుల మీద పని చేస్తాడు. తన బలమైన చేతితో దాన్ని తయారుచేస్తాడు. అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. నీళ్లు తాగకపోవడం చేత సొమ్మసిల్లి పడిపోతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 ఒక పనివాడు వేడి నిప్పుల మీద ఇనుము వేడిచేయటానికి తన పనిముట్లు వాడతాడు. లోహాన్ని కొట్టడానికి ఇతడు తన సుత్తెను ఉపయోగిస్తాడు, అప్పుడు ఆ లోహం ఒక విగ్రహం అవుతుంది. ఈ మనిషి బలమైన తన చేతులను ఉపయోగిస్తాడు. అయితే అతనికి ఆకలి వేసినప్పుడు అతని బలం పోతుంది. అతడు నీళ్లు తాగకపోతే, అతడు బలహీనం అవుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 కమ్మరి తన పనిముట్టు తీసుకుని దానితో నిప్పుల మీద పని చేస్తాడు; సుత్తితో విగ్రహానికి రూపిస్తాడు తన చేతి బలంతో దానిని తయారుచేస్తాడు. అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. అతడు నీళ్లు త్రాగడు, సొమ్మసిల్లిపోతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 44:12
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు వీరే” అని అన్నారు.


నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.


విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు, కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.


అలాంటి విలువైన దానిని అర్పణగా ఇవ్వలేని పేదవారు పుచ్చిపోని చెక్కను ఎంచుకుంటారు; విగ్రహం కదలకుండా నిలబెట్టడానికి వారు నిపుణుడైన పనివానిని వెదుకుతారు.


ప్రజలు కష్టపడతారు కాని అగ్ని పాలవుతారని, వ్యర్థమైన దాని కోసం కష్టపడి జనులు అలసిపోతారని సైన్యాల యెహోవా నిర్ణయించలేదా?


“శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి? అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి? ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి?


అప్పుడు యెహోవా నాకు నలుగురు కంసాలులను చూపించారు.


అక్కడ మీరు మనుష్యులు తయారుచేసిన కర్ర, రాతి దేవుళ్ళను సేవిస్తారు. అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ