Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 44:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఎందుకు పనికిరాని విగ్రహాన్ని పోతపోసిన దానినొక దేవునిగా రూపించేవాడు ఎవడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఎందుకూ పనికిరాని విగ్రహాన్ని పోత పోసి దాన్ని ఒక దేవుడిగా నిరూపించేవాడెవడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 ఈ తప్పుడు దేవుళ్లను ఎవరు చేశారు? పనికిమాలిన ఈ విగ్రహాలను ఎవరు చేశారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఎందుకు పనికిరాని విగ్రహాన్ని పోతపోసిన దానినొక దేవునిగా రూపించేవాడు ఎవడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 44:10
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

సలహా తీసుకున్న తర్వాత రాజు రెండు బంగారు దూడలను చేయించాడు. అతడు ప్రజలతో, “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టము. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించిన మీ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు” అని చెప్పాడు.


అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.


విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు, కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.


చూడండి, వారందరు మాయాస్వరూపులే వారి క్రియలు మోసమే; వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే.


“అంతా కలిసి రండి; దేశాల నుండి తప్పించుకు పారిపోయినవారలారా రండి. చెక్క విగ్రహాలను మోస్తూ, రక్షించలేని దేవుళ్ళకు మొరపెట్టే వారికి తెలివిలేదు.


దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”


యెహోవా, మీరే నా బలం, నా కోట, ఆపద సమయంలో నాకు ఆశ్రయం, దేశాలు నీ దగ్గరకు భూమి అంచుల నుండి వచ్చి, “మా పూర్వికులు అబద్ధపు దేవుళ్ళు తప్ప మరేమీ కలిగి లేరు. పనికిరాని విగ్రహాలు వారికి ఏ మేలు చేయలేదు.


నెబుకద్నెజరు రాజు ఒక బంగారు విగ్రహం చేయించి, దానిని బబులోను దేశంలో దూరా అనే మైదానంలో నిలబెట్టాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు.


అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా?


“శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి? అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి? ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి?


అయితే పౌలు అనే ఇతడు ఎఫెసు ఆసియా ప్రాంతాలన్నింటిలో చాలామంది ప్రజలను ఎలా ఒప్పించి దారి తప్పిస్తున్నాడో మీరు చూస్తున్నారు వింటున్నారు. మానవుల చేతులతో తయారుచేసిన దైవాలు అసలు దైవాలే కావు అని ఇతడు అంటున్నాడు.


అందుకే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో: “లోకంలో విగ్రహానికి విలువలేదు, ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అని మనకు తెలుసు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ