Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 43:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతములనుండి నా కుమార్తెలను తెప్పించుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను. దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 43:6
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక.


దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.


ఆ కాలంలో ఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలు దూరంలోనున్న భయపెట్టే ప్రజలు నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశం సైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు.


ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.


“భూమి అంచుల్లో నివసించే మీరందరు నా వైపు తిరిగి రక్షణ పొందండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.


చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.”


ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను, జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను; వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు.


నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు; నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు.


“నీ కళ్లు పైకెత్తి చూడు: అందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు; నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు, నీ కుమార్తెలు చంకనెక్కి వస్తున్నారు.


నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; నీ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, దూరము నుండి నీ పిల్లలను తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు.


ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు.


అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.”


మీరు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చెర నుండి తిరిగి రప్పిస్తాను. నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన అన్ని దేశాల నుండి అన్ని ప్రాంతాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన దేశానికి తిరిగి తీసుకువస్తాను.


“విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను.


చూడు, నేను వారిని ఉత్తర దేశం నుండి రప్పించి, భూమి మూలల నుండి వారిని పోగుచేస్తాను. వారిలో గ్రుడ్డివారు, కుంటివారు, తల్లి కాబోతున్నవారు పురిటినొప్పులు పడుతున్న స్త్రీలు ఉంటారు; గొప్ప గుంపు తరలివస్తుంది.


“ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను.


వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను.


“చూడండి, మీరు వారిని అమ్మి వేసిన స్థలాల నుండి వారిని రప్పిస్తాను. మీరు చేసిన దాన్ని మీ తల మీదికే రప్పిస్తాను.


నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశం వైపు, తెల్లని గుర్రాలున్న రథం పడమర వైపు, చుక్కలున్న గుర్రాలున్న రథం దక్షిణం వైపు వెళ్తాయి.”


మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ