Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 41:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 “ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 ఉత్తరదిక్కు నుండి నేనొకణ్ణి పురిగొల్పుతున్నాను. అతడు నా పేరున ప్రార్థిస్తాడు. అతడు సూర్యోదయ దిక్కునుండి వచ్చి ఒకడు బురద తొక్కే విధంగా, కుమ్మరి మన్ను తొక్కే విధంగా రాజులను అణగదొక్కుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొలిపాను. సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు. అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు. కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 “ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 41:25
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను.


దేవుడు లేని దేశం మీదికి నేను అతన్ని పంపుతాను, దోచుకోడానికి కొల్లగొట్టడానికి, వీధుల్లో మట్టిలా వారిని త్రొక్కడానికి నాకు కోపం కలిగించిన ప్రజల గురించి అతన్ని ఆజ్ఞాపిస్తాను.


భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.


“తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి నీతిలో పిలిచింది ఎవరు? ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు రాజులను అతని ఎదుట అణచివేస్తారు. అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు, తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు.


నేను కోరెషు గురించి, ‘అతడు నా కాపరి, నా ఇష్టాన్నంతటిని నెరవేరుస్తాడు’ అని చెప్పాను. అతడు, ‘యెరూషలేము తిరిగి కట్టబడాలి’ అని ‘మందిరం పునాదులు వేయబడాలి’ అని చెప్తాడు.”


కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి రాజులను నిరాయుధులుగా చేయడానికి అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా తలుపులు తీయడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే:


నేను నీతిని బట్టి కోరెషును పురికొల్పుతాను: అతని మార్గాలన్నీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని మరలా కడతాడు ఏ వెల ఏ బహుమానం తీసుకోకుండ బందీలుగా ఉన్నవారిని అతడు విడిపిస్తాడు అని సైన్యాల యెహోవా అన్నారు.”


అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది.


ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి దాని దేశాన్ని పాడుచేస్తుంది. దానిలో ఎవరూ నివసించరు; మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి.


అప్పుడు నా శత్రువు దాన్ని చూసి, ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడ?” అని నాతో అన్న ఆమె నా కళ్లు ఆమె పతనం చూస్తాయి; ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా కాళ్లక్రింద త్రొక్కబడుతుంది.


వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు.


ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహా నది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ