Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 40:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా? భూమి స్థాపించబడడాన్ని బట్టి మీరు గ్రహించలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరు దాని గ్రహింపలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా? భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ? తప్పక అది నీవు విన్నావు. ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు. భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా? భూమి స్థాపించబడడాన్ని బట్టి మీరు గ్రహించలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 40:21
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు.


శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; శూన్యంలో భూమిని వేలాడదీసారు.


వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.


ఆకాశాలు దేవుని నీతిని ప్రకటిస్తాయి, ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. సెలా


దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. వారి సృష్టికర్త వారికి దయ చూపించరు.


“చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను. ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను.


నీకు తెలియదా? నీవు వినలేదా? భూమి అంచులను సృష్టించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు, ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.


అలాంటివాడు బూడిద తింటాడు; మోసపూరితమైన హృదయం అతన్ని దారి తప్పిస్తుంది; తనను తాను రక్షించుకోలేడు, “నా కుడి చేతిలో ఉన్నది అబద్ధం కాదా?” అని అనలేడు.


“దీనిని జ్ఞాపకం ఉంచుకోండి, మనస్సులో పెట్టుకోండి, తిరుగుబాటు చేసే మీరు మీ హృదయంలో పెట్టుకోండి,


నా సొంత చేయి భూమికి పునాదులను వేసింది, నా కుడిచేయి ఆకాశాలను విశాలపరిచింది; నేను వాటిని పిలిచినప్పుడు అవన్నీ కలసి నిలబడతాయి.


ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది?


అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ హృదయాలను ఆనందంతో నింపుతున్నారు.”


అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ