Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 38:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ఆ తీవ్రమైన బాధ వల్లనే నాకు నెమ్మది కలిగింది. నీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతి నుండి విడిపించావు. నా పాపాలన్నిటినీ నీ వీపు వెనుకకు పారవేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి. ఇప్పుడు నాకు శాంతి ఉంది. నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు. నీవు నా పాపాలన్నీ క్షమించావు. నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 38:17
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ‘నా ఇంట్లోనే నేను చనిపోతాను, నా రోజులు ఇసుక రేణువుల్లా ఉంటాయి.


ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో, ‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి; వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.


దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.


పడమటికి తూర్పు ఎంత దూరమో, అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు.


ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు.


నరకంలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు,


యెహోవా, పాతాళం నుండి నా ప్రాణానికి పైకి లేవనెత్తారు; సమాధిలోనికి వెళ్లకుండా నన్ను కాపాడారు.


నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.


కాని దేవా, మీరు దుష్టులను నాశనకూపంలో పడవేస్తారు; రక్తపిపాసులు మోసగాళ్లు వారి ఆయుష్షులో సగం కూడ జీవించరు. కానీ నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను.


మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారు వారి పాపాలన్నీ కప్పివేశారు. సెలా


ఎందుకంటే నా పట్ల మీ మారని ప్రేమ ఎంతో గొప్పది; అగాధాల్లో నుండి, పాతాళంలో నుండి మీరు నన్ను విడిపించారు.


కాని నేనేమి అనగలను? ఆయనే నాకు మాట ఇచ్చారు, ఆయనే ఇది నెరవేర్చారు. నాకు కలిగిన వేదన బట్టి నా సంవత్సరాలన్నీ దీనుడిగా జీవిస్తాను.


“నేను నేనే నా ఇష్టానుసారంగా నీ పాపాలను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.


ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో, సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”


పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను, క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి. అయితే నా దేవా! యెహోవా, మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు.


“నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే, యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది, మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ