Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 37:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 “కాబట్టి, అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 కాబట్టి అష్షూరు రాజు గూర్చి యెహోవా చెప్పేది ఏమంటే, ‘అతడు ఈ పట్టణంలోకి రాడు. దాని మీద ఒక బాణం కూడా విసరడు. ఒక్క డాలైనా ఆడించడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

33 కనుక అష్షూరు రాజు గురించి యెహోవా చెబుతున్నాడు, “నీవు ఈ పట్టణంలో ప్రవేశించవు. నీవు ఈ పట్టణం మీద ఒక బాణంకూడ వేయవు. నీ డాళ్లతో నీవు ఈ పట్టణం మీద యుద్ధానికి కదలిరాలేవు. పట్టణం గోడలకు నీవు ఒక్క దిబ్బను కూడ కట్టలేవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 “కాబట్టి, అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 37:33
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఘోషిస్తున్న అనేక దేశాలకు శ్రమ వారు హోరెత్తిన సముద్రంలా ఘోషిస్తున్నారు! గర్జిస్తున్న ప్రజలకు శ్రమ వారు గొప్ప నీటి ప్రవాహాల్లా గర్జిస్తున్నారు!


సాయంకాలంలో ఆకస్మిక భయం! ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే.


మనం పండుగలు చేసుకునే సీయోను పట్టణాన్ని చూడండి; మీ కళ్లు యెరూషలేమును చూస్తాయి, అది ప్రశాంత నివాసంగా, కదలని గుడారంగా ఉంటుంది; దాని మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఏ ఒక్కటి తెగిపోదు.


“పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి దిబ్బలు ఎలా నిర్మించబడ్డాయో చూడండి. ఖడ్గం, కరువు తెగులు కారణంగా పట్టణం దాని మీద దాడి చేస్తున్న బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది. నీవు చెప్పింది జరగడం ఇప్పుడు నీవే చూస్తున్నావు.


సైన్యాల యెహోవా చెప్పేదేమిటంటే: “చెట్లను నరికి యెరూషలేముపై ముట్టడి దిబ్బలను కట్టండి. ఈ పట్టణం శిక్షించబడాలి; ఇందులో అణచివేయడం తప్ప ఏమీ లేదు.


యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు.


ఏదేమైనా, పండ్లచెట్లు కాదని మీకు తెలిసిన చెట్లను మీరు నరికివేయవచ్చు, వాటి కర్రను మీరు ముట్టడి వేసిన పట్టణం పతనం అయ్యేవరకు ముట్టడి పనులను నిర్మించడానికి ఉపయోగించవచ్చు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ