యెషయా 30:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం
22 అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.
22 చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. –లేచిపొమ్మని దానితో చెప్పుదురు.
22 వెండితో పోత పోసిన చెక్కిన బొమ్మలనూ, బంగారంతో పోత పోసిన విగ్రహాలనూ మీరు అపవిత్రం చేస్తారు. అసహ్యమైన గుడ్డగా వాటిని భావిస్తారు. “ఇక్కడ నుండి పో” అని వాటికి చెప్తారు.
22 వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్లు మిమ్మల్ని మైల (పాప భూయిష్టం) చేశారు. కానీ ఆ తప్పుడు దేవుళ్లను కొలవటం మీరు చాలిస్తారు. పనికిమాలిన మైలగుడ్డల్లా ఆ దేవుళ్లను మీరు పారవేస్తారు.
22 అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.
ఇదంతా ముగిసిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలీయులు యూదా పట్టణాలకు వెళ్లి పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టారు. వారు యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం, మనష్షేలలో ఉన్న క్షేత్రాలను బలిపీఠాలను నాశనం చేశారు. వాటన్నిటినీ నాశనం చేసిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాలకు వారి సొంత స్వాస్థ్యాలకు తిరిగి వచ్చారు.
ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే: సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు, అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడు అషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కాని మిగిలి ఉండవు.
కొంతమంది తమ సంచుల నుండి బంగారం కుమ్మరించి వెండిని తీసుకువచ్చి బరువు తూచి, తమకు దేవున్ని తయారుచేయడానికి కంసాలిని నియమిస్తారు, తర్వాత దానికి నమస్కరించి పూజిస్తారు.
సీయోను చేతులు చాచింది, ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. యాకోబుకు తన పొరుగువారే శత్రువులుగా మారాలని యెహోవా శాసించారు; యెరూషలేము వారి మధ్య అపవిత్రం అయ్యింది.
“ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని రక్షించలేవు. వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు వాటివలన వారి ఆకలి తీరదు వారి కడుపు నిండదు.
అందమైన ఆభరణాల బట్టి గర్వించి హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.
ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని? నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను. నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని; నా వలనే నీకు ఫలం కలుగుతుంది.”
పాడైన వస్త్రమైనా, నారతో గాని ఉన్నితో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాలైనా, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసిన వస్తువైనా అతడు తప్పక కాల్చివేయాలి, ఎందుకంటే అది తీవ్రమైన మరక, ఆ వస్తువు తప్పనిసరిగా కాల్చివేయబడాలి.
“ఆ రోజున విగ్రహాల పేర్లు ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా దేశంలోని నుండి నేను వాటిని నిర్మూలిస్తాను. ప్రవక్తలను అపవిత్ర ఆత్మను దేశంలో లేకుండా చేస్తాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
మీరు వారి దేవుళ్ళ విగ్రహాలను అగ్నిలో కాల్చివేయాలి. వాటి మీది వెండి బంగారాలను ఆశించి, మీ కోసం తీసుకోకూడదు, లేకపోతే దాని వలన మీరు చిక్కులో పడతారు. మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యము.
అయితే ఆ మృగం పట్టుబడింది, దాంతో పాటు దాని పక్షాన సూచకక్రియలు చేసిన అబద్ధ ప్రవక్త కూడా పట్టుబడ్డాడు. అతడు ఈ సూచకక్రియలతో మృగం యొక్క ముద్ర వేయబడి దాని విగ్రహాన్ని పూజించిన వారిని మోసగించాడు. వీరిద్దరు ప్రాణాలతో మండుతున్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడ్డారు.