యెషయా 28:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఫలవంతమైన లోయ తలపై ఉన్న వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది. ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని వెంటనే వాటిని మ్రింగివేస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూ రపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మ్రింగివేయబడును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం కోతకాలం రాకముందే పండిపోయిన మొదటి అంజూరపు పండులా ఉంటుంది. మొదట దాన్ని చూసినవాడు దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే నోట్లో వేసుకుని మింగివేస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 చుట్టూరా ఐశ్వర్యవంతమైన లోయగల ఆ పట్టణం ఒక కొండమీద ఆసీనమై ఉంది. అయితే ఆ “అందాల పూల కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే ఆ పట్టణం వసంత కాలానికి ముందు కాసే అంజూర పండులా ఉంటుంది. ఒక వ్యక్తి ఆ అంజూరాలు ఒకటి చూస్తే అతడు వెంటనే అంజూరం తెంపి, తింటాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఫలవంతమైన లోయ తలపై ఉన్న వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది. ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని వెంటనే వాటిని మ్రింగివేస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |