Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 28:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 సోంపును యంత్రంతో నూర్చరు, జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు; కర్రతో సోంపును దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల గొట్టును గదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు. కానీ సోపుని చువ్వతో, జీలకర్రను కర్రతో దుళ్ళకొడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

27 నల్ల జీలకర్ర నూర్చడానికి రైతు, పదును పళ్లున్న పెద్ద పలకల్ని ఉపయోగిస్తాడా? లేదు. జీలకర్ర నూర్చడానికి రైతు బండిని ఉపయోగిస్తాడా? లేదు. ఆ విత్తనాల మీద గుల్లలను రాల్చడానికి అతడు ఒక చిన్న కర్రను ఉపయోగిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 సోంపును యంత్రంతో నూర్చరు, జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు; కర్రతో సోంపును దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 28:27
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోయాహాజు సైన్యంలో మిగిలింది యాభై రౌతులు, పది రథాలు, పదివేలమంది కాల్బలం మాత్రమే. ఎందుకంటే అరాము రాజు మిగతా వారిని కళ్ళం దగ్గర దుళ్ళగొట్టిన దుమ్ములా చేశాడు.


జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు.


అతని దేవుడు అతనికి నేర్పిస్తారు సరిగా ఎలా చేయాలో ఆయనే అతనికి బోధిస్తారు.


రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి; కాబట్టి ఎప్పుడూ దానిని నూర్చుతూనే ఉండరు. నూర్చే బండి చక్రాలు దానిపై నడిపిస్తారు, కాని వాటిని పిండి చేయడానికి గుర్రాలను ఉపయోగించరు.


“చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, కొండలను పొట్టులా చేస్తావు.


యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే మీ కోపంలో కాదు, లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.


నా సేవకుడైన యాకోబూ, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను నిన్ను చెదరగొట్టే దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, నిన్ను పూర్తిగా నాశనం చేయను. కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.”


యెహోవా ఇలా చెప్తున్నారు: “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చింది.


“వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను పదవ భాగం ఇస్తున్నారు. కాని ధర్మశాస్త్రంలోని చాలా ముఖ్యమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం వంటి వాటిని నిర్లక్ష్యం చేశారు. మీరు మొదటివాటిని నిర్లక్ష్యం చేయకుండ, వెనుకటివాటిని పాటించాల్సింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ