12 గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి వెనక్కి పడి, కుంగిపోయి, వలలో చిక్కుకుని, బందీలు అయ్యేలా యెహోవా మాట వాళ్లకి ఇలా వస్తుంది.
12 గతంలో దేవుడు ఆ ప్రజలతో మాట్లాడి “ఇదిగో విశ్రాంతి స్థలం, ఇదే శాంతి స్థలం. అలసిపోయిన మనుష్యులు వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఇదే శాంతి స్థలం” అని చెప్పాడు. కానీ ప్రజలు దేవుని మాట వినిపించుకోలేదు.
అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది, ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది కానీ మీకు ఇవేవి లభించవు.
యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’
‘వారికి తెలియని ఇతర దేశ ప్రజల మధ్యలోని నేను వారిని సుడిగాలిలా చెదరగొట్టాను. వారు వదిలి వెళ్లిన దేశం గుండా ఎవరూ ప్రయాణించలేనంతగా అది పాడైపోయింది. ఇలా మనోహరమైన తమ దేశాన్ని వారు పాడుచేశారు.’ ”
మాట్లాడుతున్నవానిని మీరు తిరస్కరించకుండా చూసుకోండి. భూమి మీద హెచ్చరించిన వానిని తిరస్కరించినవారు తప్పించుకోలేకపోతే, ఇక పరలోకం నుండి మనల్ని హెచ్చరించే వానిని మనం తిరస్కరిస్తే, మనమెలా తప్పించుకోగలం?