Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 27:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెహోవా అనే నేనే దాన్ని సంరక్షిస్తున్నాను. ప్రతీ నిత్యం దానికి నీళ్ళు పోస్తున్నాను. దానికి ఎవడూ హాని తలపెట్టకుండా పగలూ రాత్రీ కాపలా కాస్తున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 “యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధతీసుకుంటాను. సరైన సమయంలో తోటకు నీళ్లు పెడతాను. రాత్రింబవళ్లు ఆ తోటను నేను కాపాడుతాను. ఆ తోటకు ఎవ్వరూ హాని చేయరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 27:3
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆకాశం క్రింద ఉన్న సమస్త జీవులను, జీవవాయువు గల ప్రతి ప్రాణిని నాశనం చేయడానికి నేను భూమి మీదికి జలప్రళయం తీసుకురాబోతున్నాను. భూమిపై ఉన్న ప్రతిదీ నశిస్తుంది.


“నేను మీతో మీ రాబోయే తరం వారితో నా నిబంధన స్థిరపరస్తున్నాను,


ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి!


సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా


అందులో దేవుడున్నారు, అది కూలదు; తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.


అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు; ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు. దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు.


“యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను.


నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.


మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను. నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను. నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.


చాలా కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు; నేను దేవుడును, నాలా ఎవరూ లేరు.


యెహోవా చెప్పే మాట ఇదే: “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను, రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను; దేశాన్ని పునరుద్ధరించి పాడైన స్వాస్థ్యాలను పంచడానికి బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని, చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి,


నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”


యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు; కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి మీ ఎముకలను బలపరుస్తారు. మీరు నీరు పెట్టిన తోటలా ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు.


నీవు దేశాల పాలు త్రాగుతావు రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.


“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను.


యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను.


మీరు బ్రతికేలా మీలో నా ఆత్మను ఉంచి మీ స్వదేశంలో మీరు నివసించేలా చేస్తాను. అప్పుడు యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


వారి మధ్య నా పరిశుద్ధాలయం నిత్యం ఉండడం చూసి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచే యెహోవాను నేనే అని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.’ ”


ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు, అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు. “బలం వలన ఎవరూ గెలవలేరు;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ