Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 27:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఆ రోజున పెద్ద బాకా ధ్వని వినిపిస్తుంది. అష్షూరు దేశంలో అంతరిస్తున్న వాళ్ళూ, ఐగుప్తులో బహిష్కరణకి గురైన వాళ్ళూ తిరిగి వస్తారు. యెరూషలేములో ఉన్న పవిత్ర పర్వతంపై ఉన్న యెహోవాను ఆరాధిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగపడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 27:13
51 ပူးပေါင်းရင်းမြစ်များ  

హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.


షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.


దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు, యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు.


అమావాస్య దినాన కొమ్ము ఊదండి, పౌర్ణమి పండుగ దినాన కొమ్ము ఊదండి;


యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు, మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు.


ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.


దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.


ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున వారికి దారి ఏర్పడినట్లు అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది.


సమస్త లోకవాసులారా, భూలోక నివాసులారా, పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు మీరు చూస్తారు, బూర ఊదినప్పుడు మీరు వింటారు.


ఈజిప్టువారికి యెహోవా తనను తాను బయలుపరచుకుంటారు; ఆ రోజున వారు యెహోవాను తెలుసుకుంటారు. వారు బలులు, భోజనార్పణలు సమర్పించి ఆయనను ఆరాధిస్తారు. వారు యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లిస్తారు.


యెహోవా ఈజిప్టును తెగులుతో బాధిస్తారు; వారిని బాధించి వారిని స్వస్థపరుస్తారు. వారు యెహోవా వైపు తిరుగుతారు, ఆయన వారి విన్నపాలు విని వారిని స్వస్థపరుస్తారు.


మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.


చివరి రోజుల్లో యెహోవా మందిరం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.


చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.


ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.


‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.


రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన పాలకుల సేవకునితో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవా నమ్మకమైనవాడు కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు, యువరాజులు చూసి నమస్కారం చేస్తారు.”


ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు: “నేను సమకూర్చిన వారే కాకుండా వారితో పాటు ఇతరులను సమకూర్చుతాను.”


“వారి యొక్క పనులు వారి ఆలోచనలను బట్టి నేను అన్ని దేశాల ప్రజలను, రకరకాల భాషలు మాట్లాడేవారిని ఒక్కచోట చేర్చడానికి వస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు.


“ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు.


ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.”


వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు.


ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.


నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి రప్పిస్తాను మీరు చెదిరిపోయి ఉన్న దేశాల నుండి బలమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న ఉగ్రతతో మిమ్మల్ని సమకూరుస్తాను.


ఇతర ప్రజల నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు చెదరిపోయిన ఆయా దేశాల్లో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపంలా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఇతర ప్రజల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధ పరుచుకుంటాను.


“కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగి యాకోబు సంతతిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కనికరిస్తాను.


అతడు తన రాజ గుడారాలను సముద్రాల మధ్య సుందరమైన పవిత్ర పర్వతం దగ్గర వేసుకుంటాడు. అయినా అతడు అంతరించిపోతాడు, ఎవరూ అతనికి సహాయం చేయరు.


వారు వణకుతూ ఈజిప్టు నుండి పక్షుల్లా ఎగిరి వస్తారు, అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా, వాటి మాంసం తిన్నా సరే, యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు. ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాలను శిక్షిస్తారు: వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు.


వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు, ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది, అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది.


ఏడవ నెల పదవ రోజు అంతటా బూరధ్వని చేయాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఈ బూరధ్వని చేయాలి.


మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, వారు మీ వారసత్వపు మంద, వారు అడవిలో ఒంటరిగా, సారవంతమైన పచ్చికబయళ్లలో నివసిస్తున్నారు. పూర్వకాలంలో మేసినట్లు వారిని బాషాను, గిలాదులో మేస్తారు.


అప్పుడు యెరూషలేముపై దాడి చేసిన దేశాలన్నిటిలో మిగిలి ఉన్నవారంతా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి గుడారాల పండుగ ఆచరించడానికి ఏటేటా యెరూషలేముకు వస్తారు.


సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను తూర్పు, పడమర దేశాల నుండి నా ప్రజలను రక్షిస్తాను.


తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయనచేత ఎన్నుకోబడిన వారిని పోగుచేస్తారు.


“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించారు; చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి, గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి, బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,


కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు: “వారి స్వరం భూలోకమంతా వినబడింది, వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.”


ప్రభువే స్వయంగా పరలోకం నుండి గొప్ప అధికార శబ్దంతో మాట్లాడడాన్ని వింటారు, అలాగే ప్రధానదూత మాట్లాడే శబ్దాన్ని వింటారు, బూర ధ్వనితో ఆయన దిగి వస్తారు, అప్పుడు క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు.


అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.


కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు.


అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూశాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి.


అప్పుడు ఏడు బూరలను పట్టుకుని ఉన్న ఆ ఏడు దూతలు వాటిని ఊదడానికి సిద్ధపడ్డారు.


ఆ స్వరం బూర ఊదిన ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహా నది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పడం విన్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ