Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 27:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. అక్కడ దూడలు మేస్తాయి అక్కడే అవి పడుకుంటాయి; అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన నివాసస్థలముగానుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అలాగే ప్రాకారాలున్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. నివాస స్థలాలు మనుషులు లేని అరణ్యాల్లా మారతాయి. అక్కడ దూడలు మేస్తాయి. అవి అక్కడే పడుకుని చెట్ల కొమ్మలను తింటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి మేస్తాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. అక్కడ దూడలు మేస్తాయి అక్కడే అవి పడుకుంటాయి; అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 27:10
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి అవి గొర్రెల మందలకు వదిలేయబడతాయి, ఎవరి భయం లేకుండా అవి అక్కడ పడుకుంటాయి.


ఆ రోజున ఇశ్రాయేలీయుల కారణంగా వారు విడిచిపెట్టిన బలమైన నిర్మానుష్యంగా పట్టణాలు పొదలు తుప్పలు పెరిగే స్థలాల్లా ఉంటాయి. అవి పాడైపోతాయి.


శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది; ప్రతి ఇంటి గుమ్మం మూయబడింది.


మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా, విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు; అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.


వడగండ్లు అడవిని నాశనం చేసినా పట్టణం పూర్తిగా నేలమట్టమైనా,


ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి; అరణ్యం సంతోషించి పూస్తుంది. అది కుంకుమ పువ్వులా,


అప్పుడు నీవు నీ హృదయంలో, ‘వీరిని నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లల్ని కోల్పోయిన గొడ్రాలిని; నేను బందీ అయ్యాను, తిరస్కరించబడ్డాను. ఈ పిల్లల్ని ఎవరు పెంచారు? నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను. కానీ వీరు ఎక్కడ నుండి వచ్చారు?’ ” అని అనుకుంటావు.


మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి.


ఆ రోజున ఒకనికి ఒక చిన్న ఆవు రెండు గొర్రెలు ఉంటాయి.


గచ్చపొదలకు, ముళ్ళకు భయపడి పారతో సాగుచేసిన కొండలన్నిటికి మీరు దూరంగా ఉంటారు; ఆ స్థలాలు పశువులు తిరగడానికి, గొర్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి.


నెమ్మదిగల పచ్చికభూములు యెహోవా కోపాగ్నికి పాడవుతాయి.


“మోరెషెతు వాడైన మీకా ప్రవక్త యూదా రాజైన హిజ్కియా దినాల్లో ప్రవచించాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు, ‘సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది, ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో నిండిపోతుంది.’


నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”


హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా వెళ్లిపోయింది.


సీయోనుకు వెళ్లే దారులు దుఃఖిస్తున్నాయి, ఎందుకంటే దాని నియమించబడిన పండుగలకు ఎవరూ రావట్లేదు. దాని ద్వారాలన్నీ నిర్జనమయ్యాయి, ఆమె యాజకులు మూలుగుతున్నారు, ఆమె యువతులు దుఃఖపడుతున్నారు, ఆమె తీవ్ర వేదనలో ఉంది.


సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది, నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.


కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి: ప్రభువైన యెహోవా పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో, నిర్జనమైన శిథిలాలతో, మీ చుట్టూ ఉన్న మిగిలిన ఇతర జాతులచేత దోచుకోబడి అపహాస్యం చేయబడిన పాడైన పట్టణాలతో మాట్లాడుతూ,


కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ