Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 22:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 కాగా ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు–మీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఈ సంగతి సేనల ప్రభువైన యెహోవా నా చెవుల్లో తెలియజేశాడు. “మీరు చేసిన ఈ దోషానికి క్షమాపణ లేదు. మీరు చనిపోయేటప్పుడైనా సరే” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: “మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం క్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 22:14
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

సౌలు కుమార్తె మీకాలుకు ఆమె చనిపోయే వరకు పిల్లలు పుట్టలేదు.


దాని చెడుతనం బట్టి లోకాన్ని వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను. క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను.


ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు. భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది; భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు.


ఈ పాపం మీకు బీటలు తీసి ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.


అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు; ఆయన తన మాట వెనుకకు తీసుకోరు. ఆయన దుష్టప్రజల మీద, కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు.


నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.


“ఇకపై అక్కడ కొన్ని రోజులు మాత్రమే బ్రతికి ఉండే శిశువులు ఉండరు. తన కాలం పూర్తి కాకుండా చనిపోయే వృద్ధుడు ఉండడు; వంద సంవత్సరాల వయస్సులో చనిపోయేవారిని పిల్లలుగా పరిగణించబడతారు; వంద సంవత్సరాలకన్నా ముందే చనిపోయే పాపిని శాపగ్రస్తుడు అంటారు.


“ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు.


తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.


యాకోబు ఆత్మగౌరవమైన తన నామం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశారు: “నేను వారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఎన్నటికీ మరువను.


కాబట్టి, ‘ఏలీ ఇంటివారి దోషానికి బలుల వలన గాని, అర్పణల వలన గాని ఎప్పటికీ ప్రాయశ్చిత్తం జరుగదు’ అని ఏలీ ఇంటివారికి నేను ప్రమాణం చేశాను.”


సౌలు రావడానికి ఒక రోజు ముందే యెహోవా సమూయేలుకు,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ