Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 21:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 సింహము గర్జించునట్టు కేకలు వేసి –నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఆ కాపలా వాడు ఇలా అరుస్తాడు. “నా ప్రభూ, ఈ పహారా స్తంభంపై ప్రతి రోజూ, రోజంతా నిలబడి ఉన్నాను. రాత్రంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 అప్పుడు ఆ కావలివాడు సింహం అనే హెచ్చరిక మాట గట్టిగా చెప్పాలి. కావలివాడు యెహోవాతో చెప్పాడు: “నా ప్రభూ! ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద ఉన్నాను. ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే ఉన్నాను, కానీ

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 21:8
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు.


యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.


పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.


వారి గర్జన సింహగర్జనలా ఉంది. కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు కాపాడే వారెవరు ఉండరు.


ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు. వారందరికి తెలివిలేదు; వారందరు మూగ కుక్కలు, వారు మొరగలేరు; వారు పడుకుని కలలు కంటారు, నిద్రంటే వారికి ఇష్టము.


యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను; పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు. యెహోవాకు మొరపెట్టే వారలారా విశ్రాంతి తీసుకోకండి,


సింహం తన గుహలో నుంచి వచ్చినట్లు ఆయన వస్తారు, అణచివేసే వారి ఖడ్గం కారణంగా యెహోవా తీవ్రమైన కోపం కారణంగా వారి భూమి నిర్జనమైపోతుంది.


ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది; దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. మీ దేశాన్ని పాడుచేయడానికి ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు. నీ పట్టణాలు నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.


“యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”


మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ