Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 19:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 సముద్రంలో నీళ్ళు ఇంకిపోతాయి. నదులు ఎండిపోయి ఖాళీ అవుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 నైలునది ఎండిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 19:5
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా, నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా,


నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.


యెహోవా సముద్రం మీద తన చేయి చాపి దాని రాజ్యాలు వణికేలా చేశారు. కనాను కోటలను నాశనం చేయడానికి ఆయన దాని గురించి ఆజ్ఞ ఇచ్చారు.


నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి అక్కడి నీళ్లు త్రాగాను. నా అరికాలితో ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.’


నేను వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఎవరూ లేరు? నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ జవాబివ్వలేదు? నా చేయి నిన్ను విడిపించలేనంత చిన్నగా ఉందా? నిన్ను రక్షించడానికి నాకు బలం లేదా? కేవలం ఒక గద్దింపుతో నేను సముద్రం ఎండిపోయేలా చేస్తాను, నదులను ఎడారిగా చేస్తాను; నీళ్లు లేక వాటి చేపలు కుళ్ళిపోయి దాహంతో చస్తాయి.


కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను మీ పక్షంగా వాదిస్తాను, మీ కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. నేను దాని సముద్రం ఆరిపోయేలా చేస్తాను, దాని నీటి ఊటలు ఎండిపోయేలా చేస్తాను.


నైలు నదిని ఎండిపోయేలా చేసి ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మేస్తాను. విదేశీయులచేత నేను ఆ దేశాన్ని అందులోని సమస్తాన్ని పాడుచేస్తాను. యెహోవానైన నేనే మాట ఇచ్చాను.


వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు; సముద్రపు అలలు అణచివేయబడతాయి నైలు నదిలోని లోతైన స్థలాలన్నీ ఎండిపోతాయి. అష్షూరు యొక్క గర్వం అణచివేయబడుతుంది, ఈజిప్టు రాజదండం తీసివేయబడుతుంది.


ఒకవేళ ఈజిప్టు కుటుంబాలు బయలుదేరి వెళ్లి పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. గుడారాల పండుగ ఆచరించడానికి రాని దేశాలకు యెహోవా నియమించిన తెగులును ఆయన వారికి సోకేలా చేస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ