Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 14:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 “నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తాను నీటిమడుగులుగా చేస్తాను; నాశనమనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 నేను దానిని ముళ్ళ పందికి స్వాధీనముగాను నీటి మడు గులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 “నేను దాన్ని గుడ్లగూబల స్వాధీనం చేస్తాను. దాన్ని నీటి మడుగులుగా చేస్తాను. నాశనం అనే చీపురుకట్టతో దాన్ని తుడిచి పెట్టేస్తాను.” ఇది సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రకటన.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 “బబులోనును నేను మార్చేస్తాను. ఆ స్థలం మనుష్యుల కోసం కాదు, జంతువుల కోసమే. ఆ స్థలం నీ టి మడుగు అవుతుంది. బబులోనును తుడిచి వేయటానికి ‘నాశనం అనే చీపురును’ నేను ప్రయోగిస్తాను” అని యెహోవా చెప్పాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 “నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తాను నీటిమడుగులుగా చేస్తాను; నాశనమనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 14:23
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ ‘దీనిని బట్టి నేను యరొబాము వంశం మీదికి కీడు రప్పించబోతున్నాను. నేను ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా యరొబాము వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. ఒకరు పెంటను కాల్చినట్లు యరొబాము వంశాన్ని పూర్తిగా దహించివేస్తాను.


నేను సమరయకు వ్యతిరేకంగా ఉపయోగించిన కొలమానాన్ని, అహాబు ఇంటిపై ఉపయోగించిన మట్టపు గుండును యెరూషలేము మీద వ్రేలాడదీస్తాను. ఒకడు గిన్నె తుడిచి బోర్లించినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను.


ఇకపై దానిలో ఎవరూ నివసించరు తరతరాలకు దానిలో ఎవరూ కాపురముండరు; అరబీయులు అక్కడ తమ డేరాలు వేసుకోరు, గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.


యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి; అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది.


సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం: దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా ఎడారిలో నుండి భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు.


దూరం నుండి ఆమెపై దాడి చేయడానికి రండి. ఆమె ధాన్యాగారాలు తెరవండి; ధాన్యం కుప్పలా ఆమెను పోగు చేయండి. దాన్ని పూర్తిగా నాశనం చేయండి ఆమెలో దేన్ని వదలవద్దు.


ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి దాని దేశాన్ని పాడుచేస్తుంది. దానిలో ఎవరూ నివసించరు; మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి.


తర్వాత ఇలా చెప్పండి, ‘యెహోవా, ఈ స్థలంలో మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండ దాన్ని నాశనం చేస్తాను; అది శాశ్వతంగా పాడైపోయి ఉంటుందని యెహోవా చెప్పారు’ అని నీవు చెప్పాలి.


గొర్రెల మందలు, పశువుల మందలు, దేశంలోని అన్ని రకాల జీవులు అక్కడ పడుకుంటాయి. ఎడారి గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ దాని స్తంభాలపై కూర్చుంటాయి. వారి కూత కిటికీల గుండా ప్రతిధ్వనిస్తుంది, రాళ్లతో తలుపులు నిండిపోతాయి, దేవదారు దూలాలు నాశనమవుతాయి.


రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’ అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు.


అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ