యెషయా 10:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 పక్షి గూటిలోనికి చేరునట్లు నా చేయి దేశాల సంపదను చేరుకుంది; ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొను చున్నానని అనుకొనును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 పక్షిగూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు దేశాల ఆస్తి చేజిక్కించుకున్నాను. విడిచిపెట్టిన గుడ్లను ఏరుకున్నట్టు నేను భూమంతా సంపాదించుకున్నాను. ఏ పక్షీ రెక్కలు ఆడించలేదు, నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు” అంటాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 ఒకడు పక్షి గూటిలోనుండి గుడ్లు తీసినట్టుగా, నేను నా స్వంత చేతుల్తో ఈ ప్రజలందరి సంపదలు తీసుకొన్నాను. ఒక పక్షి తన గూడును, గుడ్లను తరచు విడిచిపెడ్తుంటుంది. ఆ గూటిని కాపాడేందుకు ఏమీ లేదు. కిచకిచలాడ్తూ, తన రెక్కలతో, ముక్కుతో కొట్లాడేందుకు అక్కడ ఏ పక్షి లేదు. అందుచేత మనుష్యులు ఆ గుడ్లు తీసుకొంటారు. ఆదే విధంగా భూలోకంలోని మనుష్యులందరినీ నేను తీసుకొనకుండా నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 పక్షి గూటిలోనికి చేరునట్లు నా చేయి దేశాల సంపదను చేరుకుంది; ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ” အခန်းကိုကြည့်ပါ။ |