Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 8:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 “వారు గాలిని విత్తుతారు, సుడిగాలిని కోస్తారు. పైరుకు కంకులు లేవు, దాని నుండి పిండి రాదు. అది ఒకవేళ పంటకు వస్తే, విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ప్రజలు గాలిని విత్తనాలుగా చల్లారు. పెనుగాలిని వారు కోసుకుంటారు. కనిపించే పైరులో కంకులు లేవు. దాన్ని గానుగలో వేస్తే పిండి రాదు. ఒకవేళ పంట పండినా విదేశీయులు దాన్ని కోసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 ఇశ్రాయేలీయులు ఒక మూర్ఖమైన పని చేశారు అది గాలిని నాటుటకు ప్రయత్నించినట్టు ఉంది. కాని వారికి కష్టాలు మాత్రమే కలుగుతాయి. వారు సుడిగాలిని పంటగా కోస్తారు. పొలంలో ధాన్యం పండుతుంది. కానీ అది ఆహారాన్ని ఇవ్వదు. ఒకవేళ దానిలో ఏమైనా పండినా పరాయివాళ్లు దాన్ని తినేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 “వారు గాలిని విత్తుతారు, సుడిగాలిని కోస్తారు. పైరుకు కంకులు లేవు, దాని నుండి పిండి రాదు. అది ఒకవేళ పంటకు వస్తే, విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 8:7
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి.


తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.


ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.


నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.


దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు, వారి భీభత్స పాలన అంతం అవుతుంది.


మరొక చెడ్డ విషయం: ప్రతి ఒక్కరూ ఎలా వస్తారో, వారు అలాగే వెళ్లిపోతారు, వారు గాలికి ప్రయాసపడుతున్నారు కాబట్టి వారు ఏమి పొందుతారు?


నీవు వాటిని నాటిన రోజున అవి పెరిగేలా నీవు చేసినా, ఉదయాన నీవు వేసిన విత్తనాలు పూలు పూచేలా నీవు చేసినా, రోగం, తీరని దుఃఖం కలిగే రోజున పంట ఏమి లేనట్లుగా ఉంటుంది.


ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు? తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు? వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి, అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు.


చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నారు, ఆయన రథాలు సుడిగాలిలా వస్తున్నాయి. ఆయన తన కోపాన్ని తీవ్రతతో క్రిందికి తెస్తున్నారు, ఆయన గద్దింపు అగ్ని మంటలతో వస్తుంది.


వారు గోధుమలు విత్తుతారు కాని ముళ్ళ పంట కోస్తారు; వారు పనితో అలసిపోతారు కాని లాభం ఉండదు. యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.”


మా వారసత్వం అపరిచితులకు, మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు.


“కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను, ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తీసివేస్తాను. ఆమె దిగంబరత్వాన్ని కప్పుకోడానికి నేను ఇచ్చిన నా ఉన్నిని, నా జనపనారను తిరిగి తీసుకుంటాను.


విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, కాని అతడు గ్రహించడు. అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, కాని అతడు గమనించడు.


ఎఫ్రాయిమువారు మొత్తబడ్డారు, వారి వేరు ఎండిపోయింది, వారు ఇక ఫలించరు. ఒకవేళ వారు పిల్లలు కన్నా, వారి ప్రియమైన సంతతిని నేను నాశనం చేస్తాను.”


యెహోవా త్వరగా కోప్పడరు, ఆయన గొప్ప శక్తిగలవారు; యెహోవా దోషులను శిక్షించకుండ విడిచిపెట్టరు. ఆయన మార్గం సుడిగాలిలోనూ తుఫానులోనూ ఉంది, మేఘాలు ఆయన పాద ధూళి.


మీరు విస్తారంగా విత్తినా కానీ పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరడం లేదు. మీరు త్రాగుతున్నారు కానీ మత్తు ఎక్కడం లేదు. బట్టలు కప్పుకున్నా వెచ్చగా లేదు. మీరు జీతం సంపాదిస్తున్నా అది చిల్లు సంచిలో వేసినట్లే ఉంటుంది.”


మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు.


తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు.


మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ