Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 5:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “యాజకులారా! ఇది వినండి, ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, రాజ వంశస్థులారా! వినండి, ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: మీరు మిస్పాలో ఉరిగా, తాబోరు మీద వలలా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలువారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యాజకులారా, నామాట వినండి. ఇశ్రాయేలు వంశమా, శ్రద్ధగా విను. రాజ వంశమా, విను. మీరు మిస్పా మీద ఉరిగా, తాబోరు మీద వలగా ఉన్నారు. కాబట్టి మీ అందరిపైకీ తీర్పు రాబోతున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 “యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ ప్రజలారా, తీర్పు మీకోసమే ఉంది. నా మాట వినండి. “మిస్పాలో మీరు ఒక ఉచ్చువలే ఉన్నారు. తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలె మీరు ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “యాజకులారా! ఇది వినండి, ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, రాజ వంశస్థులారా! వినండి, ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: మీరు మిస్పాలో ఉరిగా, తాబోరు మీద వలలా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 5:1
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పటి నుండి నేటి వరకు, “నాకు లోబడండి” అని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను.


రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, “మీర మీ సింహాసనాలు దిగిరండి, ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు మీ తలల నుండి పడిపోతాయి.”


“నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా, “పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు, సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు.


బేతేలు, నీకు ఇలా జరుగుతుంది, ఎందుకంటే, నీ దుష్టత్వం ఘోరంగా ఉంది. ఆ రోజు ఉదయించినప్పుడు, ఇశ్రాయేలు రాజు సంపూర్ణంగా నాశనమవుతాడు.


పిల్లలు పోయిన ఎలుగుబంటిలా, నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను; సింహంలా వారిని మ్రింగివేస్తాను, అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను.


ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి, యెహోవా ఈ దేశ వాసులైన మీమీద నేరం మోపుతున్నారు: “ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు.


బందిపోటు దొంగల్లా మాటున పొంచి ఉన్నట్లు, యాజకుల గుంపు పొంచి ఉంది; షెకెము మార్గంలో వారు హత్య చేస్తారు, దుర్మార్గపు కుట్రలు చేస్తూ ఉంటారు.


నా దేవునితో పాటు ఉండే ప్రవక్త ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు, అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి. తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు.


పెద్దలారా, దీనిని వినండి; దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి. ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని, మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?


ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:


“ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”


అప్పుడు నేను ఇలా అన్నాను, “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, వినండి. న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా?


యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు;


నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు; యథార్థవంతుడు ఒక్కడూ లేడు. అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు; వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు.


“కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు. “అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.


“యాజకులారా, ఈ ఆజ్ఞ మీ కోసమే!


అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు పర్వతం మీదికి వెళ్లాడని సీసెరాకు చెప్పినప్పుడు,


ఆమె నఫ్తాలిలోని కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: ‘నీవు వెళ్లి నఫ్తాలి జెబూలూను గోత్రాల నుండి పదివేలమంది మనుష్యులను తాబోరు పర్వతం దగ్గరకు పిలిపించు.


ప్రతి సంవత్సరం అతడు బేతేలు నుండి గిల్గాలుకు అక్కడినుండి మిస్పాకు ప్రయాణిస్తూ ఆ స్థలాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ వచ్చాడు.


అప్పుడు సమూయేలు, “ఇశ్రాయేలీయులందరిని మిస్పా దగ్గర సమకూర్చండి, నేను మీ అందరి పక్షంగా యెహోవాకు విజ్ఞాపన చేస్తాను” అన్నాడు.


వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ