Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 4:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 వ్యభిచారానికి అప్పగించుకున్నారు; పాత ద్రాక్షరసం, క్రొత్త ద్రాక్షరసం వారి మతిని పోగొట్టాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షా రసం, వారి మతి పోగొట్టాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షారసం మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 వ్యభిచారానికి అప్పగించుకున్నారు; పాత ద్రాక్షరసం, క్రొత్త ద్రాక్షరసం వారి మతిని పోగొట్టాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 4:11
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు; వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.


లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,


అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు; అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.


అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది, లంచం హృదయాన్ని పాడుచేస్తుంది.


అయితే వీరు కూడ ద్రాక్షరసం త్రాగి తూలుతారు తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు తడబడతారు యాజకులు ప్రవక్తలు మద్యం మత్తులో తూలుతారు ద్రాక్షరసం వలన అయోమయంగా ఉంటారు; మద్యం మత్తులో తడబడతారు దర్శనం వచ్చినప్పుడు తూలుతారు తీర్పు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తడబడతారు.


వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.


“సమరయ ప్రవక్తల్లో నేను ఇలాంటి అసహ్యకరమైన దాన్ని చూశాను: వారు బయలు పేరిట ప్రవచించి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించారు.


నా ప్రజలు చెక్క విగ్రహాన్ని సంప్రదిస్తారు, సోదె చెప్పే వాని కర్ర వారితో మాట్లాడుతుంది. వ్యభిచార ఆత్మ వారిని చెదరగొడుతుంది; వారు తమ దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు.


“వారి పనుల వలన వారు తమ దేవుని దగ్గరకు తిరిగి రారు. వారి హృదయాల్లో వ్యభిచార ఆత్మ ఉంది; వారు యెహోవాను గుర్తించరు.


“ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.


“నీవూ, నీ కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా మద్యం త్రాగకూడదు ఇతర పులిసిన పానీయం త్రాగకూడదు, ఒకవేళ అలా చేస్తే మీరు చస్తారు. మీ రాబోయే తరాలకు ఇది నిత్య సంస్కారంగా ఉంటుంది.


“అకస్మాత్తుగా వలలో చిక్కినట్లు ఆ దినం మీ మీదికి వస్తుంది, అలా రాకుండా, తిని త్రాగి మత్తెక్కడం వలన జీవితంలోని ఆందోళనల వలన మీ హృదయాలు బరువెక్కకుండ జాగ్రత్తగా చూసుకోండి.


అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ