Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 13:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 పిల్లలు పోయిన ఎలుగుబంటిలా, నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను; సింహంలా వారిని మ్రింగివేస్తాను, అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడునట్టు నేను వారిమీదపడి వారి రొమ్మును చీల్చివేయుదును; ఆడుసింహము ఒకని మ్రింగివేయునట్లు వారిని మ్రింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 తన కూనల్ని కోల్పోయిన ఎలుగుబంటిలాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక క్రూర మృగంలాగ ఉంటాను”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 పిల్లలు పోయిన ఎలుగుబంటిలా, నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను; సింహంలా వారిని మ్రింగివేస్తాను, అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 13:8
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

హూషై ఇంకా మాట్లాడుతూ, నీ తండ్రి గురించి అతని మనుష్యుల గురించి నీకు తెలుసు; వారు యుద్ధవీరులు, కూనలను పోగొట్టుకున్న అడవి ఎలుగుబంటిలా భయంకరులు. అంతేకాక నీ తండ్రి అనుభవజ్ఞుడైన యుద్ధవీరుడు; అతడు సైన్యంతో రాత్రి గడపడు.


“దేవున్ని మరచే మీరు, కొంచెం ఆలోచించండి, లేకపోతే మిమ్మల్ని ఎవరు విడిపించలేనంతగా చీల్చి ముక్కలు చేస్తాను:


అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి, పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి.


మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.


వారి గర్జన సింహగర్జనలా ఉంది. కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు కాపాడే వారెవరు ఉండరు.


పొలం లోని సమస్త జంతువులారా, రండి, అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి!


నా వారసత్వం నాకు మచ్చలున్న క్రూరపక్షిలా కాలేదా? దాన్ని ఇతర పక్షులు చుట్టుముట్టి దాడి చేస్తాయి వెళ్లి క్రూర మృగాలన్నిటిని పోగు చేయండి; మ్రింగివేయడానికి వాటిని తీసుకురండి.


సింహం తన గుహలో నుంచి వచ్చినట్లు ఆయన వస్తారు, అణచివేసే వారి ఖడ్గం కారణంగా యెహోవా తీవ్రమైన కోపం కారణంగా వారి భూమి నిర్జనమైపోతుంది.


తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే, ఆమె ద్రాక్షలను అంజూర చెట్లను నేను పాడుచేస్తాను; వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను, అడవి జంతువులు వాటిని తినివేస్తాయి.


ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ