Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హెబ్రీయులకు 12:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు, “మరోసారి నేను భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను” అని వాగ్దానం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 అప్పు డాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు –నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశ మును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను” అని వాగ్దానం చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు, “మరోసారి నేను భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను” అని వాగ్దానం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

26 ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు “నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను” అని వాగ్దానం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హెబ్రీయులకు 12:26
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చారు కాబట్టి ఆ పర్వతమంతా పొగతో నిండిపోయింది. కొలిమి నుండి పొగ వచ్చినట్లుగా ఆ పొగ పైకి లేచింది. ఆ పర్వతమంతా భయంకరంగా కంపించింది.


సైన్యాల యెహోవా ఉగ్రత కారణంగా ఆయన కోపం రగులుకున్న రోజున ఆకాశం వణికేలా చేస్తాను; భూమి తన స్థానం నుండి తప్పుకునేలా చేస్తాను.


యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి వారు కొండల గుహల్లో నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.


“నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.


యెహోవా సీయోను నుండి గర్జిస్తారు, యెరూషలేములో నుండి ఉరుముతారు; భూమ్యాకాశాలు వణకుతాయి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉంటారు.


పర్వతాలు నిన్ను చూసి వణికాయి. నీళ్లు ప్రవాహాలుగా ప్రవహిస్తాయి; అగాధం ఘోషిస్తూ తన అలలను పైకి లేపుతుంది.


యూదాదేశపు అధికారియైన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు, నేను ఆకాశాన్ని భూమిని కదిలించబోతున్నాను.


నేను రాజ సింహాసనాలను కూలదోసి ఇతర రాజ్యాల అధికారాన్ని నాశనం చేస్తాను. నేను రథాలను రథసారథులను కూలదోస్తాను; గుర్రాలు గుర్రపురౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిపోతారు.


“ఇంకొకసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండేలా కదిలింపబడేవి అంటే సృష్టింపబడినవి తీసివేయబడతాయి అని అర్థాన్నిస్తుంది.


యెహోవా, మీరు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, మీరు ఎదోము ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది, ఆకాశం కుమ్మరించింది, మేఘాలు నీళ్లు కుమ్మరించాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ