Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హగ్గయి 2:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అందుకు హగ్గయి వారితో ఇలా అన్నాడు, “ఈ ప్రజలు, ఈ జనాలు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ అక్కడ వారు అర్పించేదంతా నా దృష్టికి అపవిత్రమే! ఇదే యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అప్పుడు హగ్గయి వారికీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారుచేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అప్పుడు హగ్గయి వారికి ఈ విధంగా జవాబిచ్చాడు. ఈ ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 పిమ్మట హగ్గయి చెప్పాడు: “దేవుడైన యెహోవా ఇలా చెవుతున్నాడు: ‘ఈ జనులకు సంబంధించినంతవరకూ ఆ విషయం కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరిశుద్ధమైనవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అందుకు హగ్గయి వారితో ఇలా అన్నాడు, “ఈ ప్రజలు, ఈ జనాలు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ అక్కడ వారు అర్పించేదంతా నా దృష్టికి అపవిత్రమే! ఇదే యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హగ్గయి 2:14
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము.


దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!


అహంకారపు చూపు గర్వ హృదయం దుష్ట క్రియలన్నీ పాపమే.


ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే, వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.


అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;


వారు యెహోవాకు ద్రాక్షరస పానార్పణలు అర్పించరు, వారి బలులు ఆయనను సంతోషపరచవు. అట్టి బలులు ఏడ్చేవారి రొట్టెలా ఉంటాయి. వాటిని తినేవారందరు అపవిత్రులవుతారు. ఈ ఆహారం వారికే సరిపడుతుంది; అది యెహోవా మందిరంలోకి రాదు.


ఎందుకంటే, పవిత్రులకు అన్ని పవిత్రంగానే ఉంటాయి కాని, నమ్మనివారికి, చెడిపోయినవారికి ఏది పవిత్రంగా ఉండదు. నిజానికి అలాంటివారి మనస్సులు, మనస్సాక్షి కూడా చెడిపోయాయి.


అగ్నిగుండం నుండి బయటకు లాగినట్లు ఇతరులను రక్షించండి. మరికొందరిపై భయంతో కూడిన కనికరం చూపండి. అయితే శరీర అపవిత్రతతో మరకపడిన వారి దుస్తులను కూడా ద్వేషించండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ