హబక్కూకు 2:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి? అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి? ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజనమేమి? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి? బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు. తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 అతని బూటకపు దేవుడు అతనికి సహాయం చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహవు తొడుగు వేసి చేసిన బొమ్మ. అది కేవలం విగ్రహం. కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్లాడలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి? అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి? ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి? အခန်းကိုကြည့်ပါ။ |
పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నీవు గొప్ప చేసుకున్నావు. దేవాలయ పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ అధికారులు, నీ భార్యలు, నీ ఉంపుడుగత్తెలు త్రాగారు. చూడలేని, వినలేని, గ్రహించలేని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి దేవుళ్ళను నీవు స్తుతించావు. కాని నీ జీవితాన్ని, నీ మార్గాలన్నిటిని తన చేతిలో పట్టుకున్న దేవున్ని నీవు గౌరవించలేదు.