Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 48:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యోసేపు అతని మోకాళ్లమధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకు అతనికి సాగిలపడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 48:12
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు.


ఆ సాయంత్రం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు, లోతు సొదొమ పట్టణ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతడు వారిని చూడగానే, వారిని కలవడానికి లేచి వారి ఎదుట సాష్టాంగపడ్డాడు.


అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హిత్తీయుల ఎదుట తలవంచాడు.


అతడు అందరికంటే ముందు వెళ్తూ, తన సోదరున్ని సమీపించే వరకు ఏడుసార్లు సాష్టాంగపడ్డాడు.


అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారిగా ఉంటూ, ఆ దేశ ప్రజలందరికి ధాన్యం అమ్మేవాడు. యోసేపు అన్నలు వచ్చి అతనికి సాష్టాంగపడి నమస్కారం చేశారు.


ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు.


యోసేపు వారిద్దరిని తీసుకుని, ఎఫ్రాయిమును తన కుడివైపు ఇశ్రాయేలుకు ఎడమవైపు మనష్షేను తన ఎడమవైపు ఇశ్రాయేలుకు కుడివైపు ఉంచి అతని దగ్గరకు తీసుకువచ్చాడు.


బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకు అదోనియా తరుపున మాట్లాడడానికి వెళ్లినప్పుడు, రాజు ఆమెను కలుసుకోడానికి లేచి ఆమెకు నమస్కారం చేసి తన సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు తల్లి కోసం సింహాసనం ఒకటి తెప్పించాడు, ఆమె అతని కుడి ప్రక్కన కూర్చుంది.


ఆమె లోపలికి వచ్చి, అతని కాళ్ల దగ్గర పడి నమస్కరించింది. తర్వాత ఆమె తన కుమారుని తీసుకుని బయటకు వెళ్లింది.


మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.


వెంటనే మోషే నేలవరకు తలవంచి ఆరాధిస్తూ,


ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు:


“ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.


“ ‘వృద్ధులు ఉన్నప్పుడు వారి ముందు నిలబడండి, వృద్ధులను గౌరవించండి, మీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నేను యెహోవాను.


పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ