ఆదికాండము 43:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వారు, “ఆయన మమ్మల్ని ఖండితంగా ప్రశ్నించాడు. ‘మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకొక సోదరుడు ఉన్నాడా?’ అని అడిగాడు. మేము అతని ప్రశ్నలకు జవాబిచ్చాం అంతే. ‘మీ తమ్మున్ని ఇక్కడకు తీసుకురండి’ అని అంటాడని మాకు ఎలా తెలుస్తుంది?” అని అన్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వారు–ఆ మనుష్యుడు–మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మునుగూర్చియు మా బంధువులనుగూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి–మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వారు “అతడు ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాము. ‘మీ తమ్ముణ్ణి తీసుకు రండి’ అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది?” అన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వారు, “ఆయన మమ్మల్ని ఖండితంగా ప్రశ్నించాడు. ‘మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకొక సోదరుడు ఉన్నాడా?’ అని అడిగాడు. మేము అతని ప్రశ్నలకు జవాబిచ్చాం అంతే. ‘మీ తమ్మున్ని ఇక్కడకు తీసుకురండి’ అని అంటాడని మాకు ఎలా తెలుస్తుంది?” అని అన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |