Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 41:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

40 నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

40 నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

40 నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

40 అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

40 నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 41:40
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. మీరు తన భార్య కాబట్టి నా యజమాని మిమ్మల్ని తప్ప మిగతాదంతా నాకు అప్పగించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా అలాంటి చెడ్డపని నేను ఎలా చేయగలను?” అని అన్నాడు.


అప్పుడు యూదా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు: “నా ప్రభువా, మీ దాసుని క్షమించి నా ప్రభువుతో ఒక్క మాట మాట్లాడనివ్వండి. మీరు ఫరోతో సమానులైనను మీ దాసునిపై కోప్పడకండి.


వారు అతనితో, “యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు! నిజానికి, అతడు ఈజిప్టు అంతటికి పాలకుడు” అని చెప్పారు. అది విని యాకోబు ఆశ్చర్యపోయాడు; అతడు వారి మాటను నమ్మలేదు.


రాజైన అహష్వేరోషుకు రెండవ స్థానంలో యూదుడైన మొర్దెకై ఉన్నాడు, అతడు యూదులలో ప్రముఖునిగా, తన తోటి యూదులైన ఎంతోమంది ద్వారా గౌరవం పొందుకున్నాడు, ఎందుకంటే తన ప్రజల క్షేమాన్ని విచారిస్తూ, యూదులందరి యొక్క శ్రేయస్సు కోసం మాట్లాడేవాడు.


ఈ సంఘటనలు జరిగిన తర్వాత, రాజైన అహష్వేరోషు అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇతర సంస్థానాధిపతులందరికన్నా ఉన్నత స్థానాన్ని ఇచ్చి అతన్ని గౌరవించాడు.


నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి నా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే,


ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.


తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.


అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞమేరకు, దానియేలుకు ఊదా రంగు వస్ర్తం తొడిగించారు, అతని మెడలో బంగారు గొలుసు వేశారు, అతన్ని రాజ్యంలో మూడవ అధికారిగా ప్రకటించారు.


అయితే దానియేలు తనకున్న గొప్ప లక్షణాలను బట్టి అధిపతులకంటే, నిర్వాహకులకంటే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి రాజు తన రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని అనుకున్నాడు.


కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి, అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించారు. ఆయన యోసేపుకు జ్ఞానం ఇచ్చి ఈజిప్టు రాజైన ఫరో దయ పొందుకొనేలా చేశారు. కాబట్టి ఫరో ఈజిప్టు దేశమంతటిమీద అలాగే అతని రాజభవనం మీద కూడా అతన్ని అధికారిగా నియమించాడు.


అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ