ఆదికాండము 38:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడు షేలా ఎదిగే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “తన అన్నల్లా ఇతడు కూడా చనిపోతాడేమో” అని అనుకున్నాడు. కాబట్టి తామారు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వెళ్లింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అప్పుడు యూదా–ఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొని–నా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 అప్పుడు యూదా, “నీవు తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి చేసుకోకు” అని తన కోడలైన తామారుతో చెప్పాడు. షేలా కూడ తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడు షేలా ఎదిగే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “తన అన్నల్లా ఇతడు కూడా చనిపోతాడేమో” అని అనుకున్నాడు. కాబట్టి తామారు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వెళ్లింది. အခန်းကိုကြည့်ပါ။ |