Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 32:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.” కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 అప్పుడు యాకోబు–నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన–నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 అప్పుడు యాకోబు “దయచేసి నీ పేరు చెప్పు” అన్నాడు. అందుకాయన “నా పేరు ఎందుకు అడుగుతావు?” అని చెప్పి అక్కడ అతణ్ణి ఆశీర్వదించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

29 అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో చెప్పు” అని అడిగాడు. అయితే ఆ మనిషి “నీవు నా పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.” కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 32:29
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.


“దేవుని రహస్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలవా?


అందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను.


“రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; ఆయన మనల్ని గాయపరచారు కాని ఆయన మన గాయాలను కడతారు.


ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!


రహస్య విషయాలు మన దేవుడైన యెహోవాకు చెందినవి, కానీ వెల్లడించబడిన విషయాలు మనకు మన పిల్లలకు ఎప్పటికీ ఉంటాయి, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ మనం పాటించాలి.


యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చాక, దేవుడు అతనికి మరలా ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు.


ఇకమీదట నీ పేరు అబ్రాము కాదు; నీకు అబ్రాహాము అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను.


దేవుడు అతనితో, “నీ పేరు యాకోబు, కానీ ఇక ఎన్నడు యాకోబుగా పిలువబడవు; నీ పేరు ఇశ్రాయేలు” అని అన్నారు. కాబట్టి ఆయన అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టారు.


మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరకు ఈ వర్తమానంతో దూతలను పంపాడు: “నీ సహోదరుడైన ఇశ్రాయేలు ఇలా చెప్తున్నాడు: మా మీదికి వచ్చిన కష్టాలన్నిటి గురించి నీకు తెలుసు.


అప్పుడు ఏలీయా, “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందుకున్న యాకోబు గోత్రాల లెక్క చొప్పున పన్నెండు రాళ్లు తీసుకున్నాడు.


వారు ఈనాటి వరకు తమ పూర్వాచారాలను పాటిస్తున్నారు. యెహోవా ఇశ్రాయేలు అని పేరుపెట్టబడిన యాకోబు సంతానం ఆయనను ఆరాధించలేదు, ఆయన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను అనుసరించలేదు.


అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు: ఏశావు, ఇశ్రాయేలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ