Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 3:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి, “అన్ని రకాల పశువుల్లోను, అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు! నీవు బ్రతుకు దినాలన్ని నీ పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు: “ఈ మహా చెడ్డ పని నీవే చేశావు కనుక నీవు శపించబడ్డావు. జంతువులన్నిటి కంటే నీ పరిస్థితి హీనంగా ఉంటుంది. నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌతుంది. నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి, “అన్ని రకాల పశువుల్లోను, అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు! నీవు బ్రతుకు దినాలన్ని నీ పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 3:14
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి కలది. సర్పం స్త్రీతో, “దేవుడు, ‘తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు’ అని నిజంగా చెప్పారా?” అని అడిగింది.


ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు.


“ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే, మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి; ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనుష్యుని సృజించారు.


ఎడారిలో నివసించే ప్రజలు ఆయన ముందు తలవంచుతారు. తన శత్రువులు మట్టిని నాకుతారు.


అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు; నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది. దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది; ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది.


తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది, దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది. నా పరిశుద్ధ పర్వతం మీద అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు” అని యెహోవా చెప్తున్నారు.


“ ‘అందువల్ల మీరు పవిత్రమైన జంతువులకు అపవిత్రమైన జంతువులకు, పవిత్రమైన పక్షులకు అపవిత్రమైన పక్షులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అపవిత్రమైనవని మీకు వేరుచేసి చెప్పిన ఏ జంతువు వలన గాని పక్షి వలన గాని నేల మీద ప్రాకే దేనివలన గాని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.


పాములా, నేల మీద ప్రాకే పురుగులా, వారు ధూళిని నాకుతారు. వారు తమ గుహల్లో నుండి వణకుతూ బయటకు వస్తారు; వారు భయంతో మన దేవుడైన యెహోవా వైపు తిరుగుతారు, నిన్ను బట్టి భయపడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ