Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 27:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

40 నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు నీ సోదరునికి సేవ చేస్తావు, అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి పడవేస్తావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

40 నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

40 నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

40 నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు. అయితే స్వతంత్రం కోసం నీవు పోరాడతావు. అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

40 నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు నీ సోదరునికి సేవ చేస్తావు, అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి పడవేస్తావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 27:40
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.”


జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.”


ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, “నీ సోదరుడు ఏశావు దగ్గరకు వెళ్లాం, ఇప్పుడు అతడు నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో నాలుగువందలమంది మనుష్యులు ఉన్నారు” అని అన్నారు.


అయితే ఏశావు, “నా తమ్ముడా, నాకిప్పటికే సమృద్ధిగా ఉంది. నీది నీవే ఉంచుకో” అని అన్నాడు.


అతడు ఎదోము దేశమంతటా సైనిక దళాలను ఉంచాడు. ఎదోమీయులంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయమిచ్చారు.


నీవు ఎదోమును ఓడించి గర్విస్తున్నావు, నీ విజయంతో తృప్తిపడి ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”


అమజ్యా ఉప్పు లోయలో యుద్ధం చేసి పదివేలమంది ఎదోమీయులను చంపి, సెల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి యొక్తియేలు అనే పేరు పెట్టాడు. ఈనాటికి దాని పేరు అదే.


ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది, ఎందుకంటే యెహోరాము తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు.


యెహోరాము కాలంలో, ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు.


ఎందుకంటే, మరోసారి ఎదోమీయులు యూదా మీదికి దండెత్తివచ్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయారు.


మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను, ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”


“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ