Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 26:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అక్కడ అతడు చాలాదినము లుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలోనుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత, ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీమెలెకు తన కిటికీ గుండా చూశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 26:8
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

అక్కడి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరు అని అతన్ని అడిగితే, “ఆమె నా సోదరి” అని చెప్పాడు, ఎందుకంటే, “ఆమె నా భార్య” అని చెప్పడానికి భయపడ్డాడు. “రిబ్కా అందంగా ఉంది కాబట్టి తనను బట్టి ఈ స్థలం యొక్క మనుష్యులు నన్ను చంపేస్తారు” అని అతడు అనుకున్నాడు.


కాబట్టి అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజంగా ఈమె నీ భార్య కదా! ‘ఆమె నా సోదరి’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. ఇస్సాకు, “ఆమె కారణంగా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను” అని జవాబిచ్చాడు.


నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను.


సూర్యుని క్రింద దేవుడు మీకు ఇచ్చిన ఈ అర్థరహితమైన జీవితకాలమంతా మీరు ప్రేమించే మీ భార్యతో జీవితాన్ని ఆస్వాదించండి; ఎందుకంటే ఇది మీ జీవితంలో సూర్యుని క్రింద మీరు పడిన కష్టంలో మీకు లభించే భాగము.


నా ప్రియుడు జింకలాంటి వాడు, లేదా లేడిపిల్ల లాంటివాడు. చూడండి! అక్కడ అతడు మా గోడ వెనుక నిలబడి కిటికీల గుండా చూస్తూ, జాలక గుండా దాచుకుని చూస్తున్నాడు.


యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు; పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.


“సీసెరా తల్లి కిటికీలో నుండి చూస్తూ ఉంది; అల్లిక కిటికీలో నుండి చూస్తూ ఏడుస్తుంది, ‘అతని రథం తిరిగి రావడానికి ఎందుకు ఇంత సమయం పడుతోంది? అతని రథాల చప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది?’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ