Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 24:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 నేను వారిలో ఒక యవ్వన స్త్రీతో, ‘నీ కడవ క్రిందికి వంచు, నేను నీళ్లు త్రాగుతాను’ అని అడిగినప్పుడు, ఏ స్త్రీ అయితే, ‘ఇదిగో త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను’ అని అంటుందో, ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు మీరు ఎంచుకున్న స్త్రీ అయి ఉండాలి. దీనిని బట్టి నా యజమాని పట్ల మీరు దయ చూపారు అని గ్రహిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 కాబట్టి–నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా –నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఇది ఈ విధంగా జరగనియ్యి. ‘నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిన్ని నీళ్ళు పొయ్యి’ అని నేను అంటే ‘తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను’ అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు త్రాగాలి, నీ కడవ క్రింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘త్రాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 నేను వారిలో ఒక యవ్వన స్త్రీతో, ‘నీ కడవ క్రిందికి వంచు, నేను నీళ్లు త్రాగుతాను’ అని అడిగినప్పుడు, ఏ స్త్రీ అయితే, ‘ఇదిగో త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను’ అని అంటుందో, ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు మీరు ఎంచుకున్న స్త్రీ అయి ఉండాలి. దీనిని బట్టి నా యజమాని పట్ల మీరు దయ చూపారు అని గ్రహిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 24:14
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, దీనిని నేను స్వాస్థ్యంగా పొందుతానని నాకెలా తెలుస్తుంది?” అని అడిగాడు.


నేను ఈ నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, ఈ పట్టణవాసుల కుమార్తెలు నీళ్లు తోడుకోడానికి వస్తున్నారు.


అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె.


“అయ్యా త్రాగండి” అని అంటూ రిబ్కా వెంటనే కుండను చేతి మీదికి దించుకుని, అతనికి నీళ్లు ఇచ్చింది.


అతనికి నీళ్లు ఇచ్చిన తర్వాత, “మీ ఒంటెలకు కూడా, వాటికి సరిపడే నీళ్లు చేది పోస్తాను” అని చెప్పింది.


ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ ఒక యువతి నీళ్ల చేదుకోడానికి వస్తే, నేను, “దయచేసి త్రాగడానికి నీ కుండ నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని నేను అడిగితే,


ఏ యువతైతే, “త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను” అని అంటుందో, ఆ యువతే యెహోవా నా యజమాని కుమారునికి భార్య కావాలి’ అని నేను ప్రార్థన చేశాను.


యోవాబు, “నా సోదరుడా! క్షేమమా?” అని అమాశాను అడిగి అతన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లు కుడిచేతితో అతని గడ్డం పట్టుకున్నాడు.


కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే వేగంగా కదులు ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి యెహోవా నీకు ముందుగా వెళ్లారని దాని అర్థం” అని అతనికి జవాబిచ్చారు.


ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.


“నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే” అన్నారు.


దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు రావడానికి కనీసం ఇప్పటికైనా నాకు అవకాశం రావాలని ప్రార్థిస్తున్నాను.


అప్పుడు వారు అతనితో, “మా ప్రయాణం సఫలమవుతుందో లేదో దయచేసి దేవుని దగ్గర విచారించి మాకు చెప్పు” అని అన్నారు.


అందుకు గిద్యోను అన్నాడు, “మీ దృష్టిలో నా పట్ల దయ ఉంటే, మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నట్లు నాకొక గుర్తు ఇవ్వండి.


చూడండి, నేను నూర్పిడి కళ్ళం మీద గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి నేలంతా పొడిగా ఉంటే, మీరు చెప్పినట్టు నా ద్వారా మీరు ఇశ్రాయేలును రక్షిస్తారని గ్రహిస్తాను” అన్నాడు.


అప్పుడు అతడు, ‘అలాగే’ అని చెప్తే నీ సేవకుడనైన నేను క్షేమము. కానీ ఒకవేళ అతడు నా మీద తీవ్రంగా కోపపడితే అతడు నాకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నట్లు నీవు తెలుసుకుంటావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ