Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 20:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ‘ఆమె నా సోదరి’ అని అతడు చెప్పలేదా? ‘ఇతడు నా అన్న’ అని ఆమె కూడా చెప్పలేదా? నేను నిర్మలమైన మనస్సాక్షితో నిర్దోషిగా ఉండి దీన్ని చేశాను” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 –ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ–అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ‘ఈమె నా చెల్లి’ అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా ‘అతడు నా అన్న’ అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ‘ఈ స్త్రీ నా సోదరి’ అని అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా ‘ఈ పురుషుడు నా సోదరుడు’ అని చెప్పింది. నేను నిర్దోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ‘ఆమె నా సోదరి’ అని అతడు చెప్పలేదా? ‘ఇతడు నా అన్న’ అని ఆమె కూడా చెప్పలేదా? నేను నిర్మలమైన మనస్సాక్షితో నిర్దోషిగా ఉండి దీన్ని చేశాను” అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 20:5
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు నా చెల్లివని చెప్పు, అప్పుడు నీకోసం నన్ను మంచిగా చూసుకుంటారు, అప్పుడు నిన్ను బట్టి నా ప్రాణం సురక్షితంగా ఉంటుంది” అని చెప్పాడు.


దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తిరిగేలా చేసినప్పుడు, నేను ఆమెతో ఇలా చెప్పాను, ‘మనం వెళ్లే ప్రతిచోటా నా గురించి, “ఈయన నా సోదరుడు” అని చెప్పు, ఇది నా పట్ల నీ ప్రేమ.’ ”


అతడు శారాతో, “నీ అన్నకు వెయ్యి షెకెళ్ళ వెండి ఇస్తున్నాను, ఇది నీతో ఉన్న వారందరి ఎదుట నీకు విరోధంగా చేసిన దానికి నష్టపరిహారం; నీవు పూర్తిగా నిర్దోషివి” అన్నాడు.


“నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా యథార్థత నిజాయితీగల హృదయంతో జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే,


“యెహోవా, నేను నమ్మకంగా, యథార్థ హృదయంతో మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.


నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను.


అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు; నేను శుద్ధుడను పాపం లేనివాడను.


ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!


నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది, కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.


యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని, బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.


యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక. యెహోవా, నా నీతిని బట్టి, ఓ మహోన్నతుడా, నా యథార్థతను బట్టి నాకు శిక్షావిముక్తి చేయండి.


మనస్సులను హృదయాలను పరిశీలించే, నీతిమంతుడవైన దేవా, దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, నీతిమంతులను భద్రపరచండి.


నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.


దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు; జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు.


యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.


నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.


నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు.


ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితితో, దేవుడు ఇచ్చే పవిత్రతతో మేము నడచుకున్నాము. లోకజ్ఞానంపై ఆధారపడక దేవుని కృపపై ఆధారపడి నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.


విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.


ఒకప్పుడు నేను క్రీస్తును తెలుసుకోక ముందు విశ్వాసంలో దృఢపడక ముందు దైవదూషణ చేసేవానిగా, హింసించేవానిగా దుర్మార్గునిగా ఉన్నాను అయినప్పటికీ దేవుడు నన్ను కనికరించాడు.


“శక్తిమంతుడైన యెహోవా దేవుడు! శక్తిమంతుడైన దేవుడు యెహోవా! అది ఆయనకు తెలుసు! ఇశ్రాయేలుకు తెలియనివ్వండి! ఇది యెహోవా పట్ల ద్రోహంతో గాని తిరుగుబాటుతో గాని చేసివుంటే ఈ రోజు మమ్మల్ని రక్షించవద్దు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ