ఆదికాండము 19:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 వారు, “మాకు అడ్డు పడకుండా వెళ్లిపో” అని బదులిచ్చారు. “వీడు పరదేశిగా ఇక్కడకు వచ్చి మనకే తీర్పు చెప్తున్నాడు! మేము నిన్ను వారిపైన కంటే నీమీద ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అని అంటూ లోతు మీద పడి తలుపు బద్దలు కొట్టడానికి ముందుకు వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు–నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు–వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 కానీ వాళ్ళు “నువ్వు అవతలికి పో” అన్నారు. ఇంకా వాళ్ళు “వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు. ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి! ఇప్పుడు వాళ్ళపైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మీగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 “దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈ లోతు ఒక యాత్రికుడుగా మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు చెబుతున్నాడు” అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పి, లోతుకు మరింత సమీపంగా వెళ్లి, తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 వారు, “మాకు అడ్డు పడకుండా వెళ్లిపో” అని బదులిచ్చారు. “వీడు పరదేశిగా ఇక్కడకు వచ్చి మనకే తీర్పు చెప్తున్నాడు! మేము నిన్ను వారిపైన కంటే నీమీద ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అని అంటూ లోతు మీద పడి తలుపు బద్దలు కొట్టడానికి ముందుకు వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။ |