ఆదికాండము 16:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అప్పుడు శారయి– నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అప్పుడు శారయి అబ్రాముతో “నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు” అంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది. အခန်းကိုကြည့်ပါ။ |